
*ఈనెల 16 లేదా 17 వ తేదీ నుంచి నగర వ్యాప్తంగా ఉన్న 7 ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు వస్తున్నామని తెలియజేశారు. సుమారు ఒక కోటి 50 లక్షల రూపాయలతో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను నగరంలో ఏర్పాటు చేశామని తెలిపిన కమిషనర్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగం నందు ఆర్ అండ్ బి అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈనెల 16 లేదా 17 వ తేదీ నుంచి నగర వ్యాప్తంగా ఉన్న 7 ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు వస్తున్నామని తెలియజేశారు. సుమారు ఒక కోటి 50 లక్షల రూపాయలతో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను నగరంలో ఏర్పాటు చేశామని కమిషనర్ తెలిపారు.
అందుకు సంబంధించిన ట్రయల్ రన్ ను విజయవంతంగా పూర్తి చేశామని, కంట్రోల్ ప్యానెల్ వ్యవస్థను అనుసంధానించే కార్యక్రమం మరో రెండు రోజుల్లో పూర్తి అవుతుందని తెలిపారు.
నగరవ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో నెల్లూరు ట్రాఫిక్ పోలీసుల కంట్రోల్ తో పాటు నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా పర్యవేక్షించబడుతుందని కమిషనర్ తెలిపారు.
ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటుచేసిన మాట్రిక్స్ కంపెనీ వారు రూపొందించిన సాంకేతికత ఆధారంగా నెల్లూరు నగరపాలక సంస్థ నుంచి ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఉల్లంఘించిన వారిపై ఆటోమేటిగ్గా చలానాలు విధించే విధానాన్ని కూడా అమలు చేయబోతున్నామని కమిషనర్ తెలిపారు.
కావున నెల్లూరు నగర ప్రజలు వాహన చోదకులు అందరూ ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థపై అవగాహన పెంచుకొని నిర్దేశించిన మార్గాలలో వాహనాల రాకపోకల సమయంలో తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలను క్రమశిక్షణగా పాటించాలని ఈ సందర్భంగా కమిషనర్ తెలియజేశారు.
ఈ సమావేశంలో ఆర్ అండ్ బి డి.ఈ.ఈ మహబూబ్, ట్రాఫిక్ సి.ఐm రామకృష్ణ, నేషనల్ హైవే అథారిటీ ఏ. ఈ. సుమన్ పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.