*ఈ ఏడాది నుంచి ఆత్మకూరులో బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభం*..మంత్రి ఆనం. రామ్ నారాయణ రెడ్డి*
– అన్ని మౌలిక వసతులు కల్పించాలని బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ కు సూచించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
– పాలిటెక్నిక్ కళాశాలలో రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు వసతులు పరిశీలించిన మంత్రి ఆనం
ఆత్మకూరు, జనవరి 11 : ఆత్మకూరు లో నూతన బీసీ బాలికల రెసిడెన్షియల్ కళాశాలను సమీప పాలిటెక్నిక్ కళాశాల భవనాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. శనివారం సాయంత్రం ఆత్మకూరులోని పాలిటెక్నిక్ కళాశాలను మంత్రి సందర్శించి, రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు అవసరమైన తరగతి గదులు, బెంచీల ఏర్పాటు, తాగునీరు, మరుగుదొడ్లు, హాస్టల్ వసతి సౌకర్యాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ కు ఫోన్ చేసి హాస్టల్ ఏర్పాటుకు అవసరమైన అన్ని వసతి సౌకర్యాలు పూర్తి స్థాయిలో సమకూర్చాలని సూచించారు. ప్రధానంగా అదనపు మరుగుదొడ్లు, హాస్టల్లో విద్యార్థులు ఉండేందుకు మంచాలు,డైనింగ్ టేబుల్ ఏర్పాటు మొదలైన వసతి సౌకర్యాలు వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆత్మకూరు బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి చెప్పారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మంత్రి వెంట గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు. అనంతరం ఆత్మకూరు లో రహదారులు మరియు భవనాల శాఖా అతిథి భవనాన్ని పరిశీలించారు..స్థానిక పురాతన పంచాయతీ రాజ్ అతిథి భవనాల స్థానంలో నూతన భవనాలకు 85 లక్షలు మంజూరు చేశామన్నారు
……………
DIPRO NELLORE