ఆర్ పి ఐ పార్టీలో చేరిన బిజెపి నాయకులు. ..
నెల్లూరు గాంధీ బొమ్మ ఆర్ పి ఐ పార్టీ జిల్లా కార్యాలయం నందు ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎస్ కే మా బు గారి ఆధ్వర్యంలో బిజెపి మీడియా విభాగానికి చెందిన దాసరి కమలాకర్ గారు ఆర్ పి ఐ పార్టీలో చేరి నారు.
ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా అధ్యక్షులు మబూ మాట్లాడుతూ దాసరి కమలాకర్ బిజెపిని వీడి ఆర్ పి ఐ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు బిజెపి లో దళిత ముస్లిం బహుజనులకు రాజకీయంగా చోటు ఉండదు ఇవ్వరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
దళితులను ముస్లింలను శత్రువుగా చూసే పార్టీ ఏదైనా ఉందంటే అది బిజెపి పార్టీ అని అన్నారు.
ఈ సందర్భంగా దాసరి కమలాకర్ మాట్లాడుతూ దళితులను బిజెపిలో చాలా హేళనగా చూడడం దళితులమైన మమ్మలను ఇతర సామాజిక వర్గాల మీద విద్వేషాలకు ప్రేరేపించడం తప్ప రాజకీయంగా ఎదుగుదల లేకపోవడాన్ని గమనించిన నేను బాబా సాహెబ్ అంబేద్కర్ స్థాపించిన ఆర్ పి ఐ పార్టీలో చేరానని అన్నారు
పార్టీలో ఒక కార్యకర్తలారా పనిచేసే ప్రజా సమస్యలపై పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని నన్ను నా మిత్ర బృందాన్ని పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు మాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో తాటిపర్తి ప్రభాకర్ పట్టపు రంగారావు ముసలి జయరాజు సీనియర్ సిటిజెన్ కన్వీనర్ నిమ్మల సుబ్బయ్య గారు తదితరులు పాల్గొన్నారు