*ఆర్ అండ్ బి అధికారులతో జిల్లా రహదారులపై ఎంపీ వేమిరెడ్డి సమీక్ష*
జిల్లాలో రహదారుల స్థితిగతులపై నెల్లూరు పార్లమెంటు సభ్యులు రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్ అండ్ బి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
శనివారం సాయంత్రం ఆయన నివాసంలో ఆర్ అండ్ బి ఎస్ ఈ, కావలి, నెల్లూరు ఈఈ లతో భేటీ అయిన ఆయన.. జిల్లాలో రహదారుల పరిస్థితిపై ఆరా తీశారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టిన రహదారుల స్థితిగతులను తెలుసుకున్నారు.
వివిధ అంశాలను అధికారులు… ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.