*ఆదాల ఆశీర్వాదం తీసుకున్న నూతన వధూవరులు*
నెల్లూరులోని విపిఆర్ కన్వెన్షన్లో బుధవారం జరిగిన టంగుటూరు శ్రీనివాసులురెడ్డి కుమార్తె శరణ్య, కొడవలూరు వెంకట కృష్ణారెడ్డి కుమారుడు భాస్వంత్ రెడ్డి వివాహ మహోత్సవ కార్యక్రమానికి *నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు* హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను మాజీ ఎంపీ ఆదాల అక్షింతలు వేసి శుభఆశీస్సులు అందించారు. అదేవిధంగా నెల్లూరు విజయ డెయిరి చైర్మన్ కొండ్రేడ్డి రంగారెడ్డిగారు నూతన వధూవరులకు ఆశీస్సులు అందించారు. వివాహ మహోత్సవ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వర్ణ వెంకయ్య, పాశం శ్రీనివాస్, సీ హెచ్ హరిబాబు యాదవ్, మంగళ పూడి శ్రీకాంత్ రెడ్డి, బెల్లంకొండ వెంకయ్య, నాని తదితరులు హాజరయ్యారు.