*ఆంధ్రప్రదేశ్ ఆశాకిరణం మంత్రి యువనేత లోకేష్* – 11 ఉమ్మడి జిల్లాలు, 97 నియోజకవర్గాలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజులపాటు పాదయాత్ర ఫలితమే 2024 ఎన్నికల్లో 164 సీట్లు. – ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రానికి గూగుల్, టిసిఎస్. ఇన్ఫోసిస్, వంటి IT కంపెనీలు తెస్తూ అభివృద్ధి చేస్తున్నారు. – సీఎం చంద్రబాబు గారిని మించిన నాయకుడిగా నారా లోకేష్‌ గారు ఎదుగుతారు. – ఒకేరోజు 27 కోట్లతో 240 పనులకు శంకుస్థాపనలు చేసి అన్నాను మించిన తమ్ముడు అనిపించుకున్నారు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి. – యువగళం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ ర్యాలీలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.

*ఆంధ్రప్రదేశ్ ఆశాకిరణం మంత్రి యువనేత లోకేష్*

– 11 ఉమ్మడి జిల్లాలు, 97 నియోజకవర్గాలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజులపాటు పాదయాత్ర ఫలితమే 2024 ఎన్నికల్లో 164 సీట్లు.
– ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రానికి గూగుల్, టిసిఎస్. ఇన్ఫోసిస్, వంటి IT కంపెనీలు తెస్తూ అభివృద్ధి చేస్తున్నారు.
– సీఎం చంద్రబాబు గారిని మించిన నాయకుడిగా నారా లోకేష్‌ గారు ఎదుగుతారు.
– ఒకేరోజు 27 కోట్లతో 240 పనులకు శంకుస్థాపనలు చేసి అన్నాను మించిన తమ్ముడు అనిపించుకున్నారు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి.
– యువగళం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ ర్యాలీలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.

యువనేత ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేసిన యువగళం పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన యువగళం… ప్రజా గళం ర్యాలీకి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. స్థానిక సర్వోదయ కళాశాల దగ్గర నుంచి మద్రాస్ బస్టాండ్ కూరగాయల మార్కెట్ వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు నాడు చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో జనవరి 27వ తేదీ ఒక అద్భుతమైన రోజుగా అభివర్ణించారు. యువ నాయకులు, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ గారు రాష్ట్ర భవిష్యత్తును తిరగరాసేలా యువగళం పాదయాత్ర చేశారని కొనియాడారు.

గత ప్రభుత్వం పెట్టిన అవాంతారాలకు ఎదురొడ్డి 3వేల 132 కిలోమీటర్ల యువగళం పాదయాత్ర చేసి మంత్రి లోకేష్ గారు చరిత్ర సృష్టించారన్నారు. .11 ఉమ్మడి జిల్లాలు, 97 నియోజకవర్గాలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజులపాటు పాదయాత్ర ఫలితమే 2024 ఎన్నికల్లో టిడిపి 164 సీట్లలో విజయకేతనం ఎగురవేసేందుకు దోహదపడిందన్నారు. ఓ వైపు
విద్యా శాఖా మంత్రిగా ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు మరో వైపు ఐటి మంత్రిగా రాష్ట్రానికి గూగుల్, టిసిఎస్. ఇన్ఫోసిస్, వంటి IT కంపెనీలు తెస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని యువనేత లోకేష్ గారు అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని కొనియాడారు. సీఎం చంద్రబాబు గారిని మించిన నాయకుడిగా నారా లోకేష్‌ గారు ఎదుగుతారని ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జి హోదాలో ఒకేరోజు 27 కోట్లతో 240 పనులకు శంకుస్థాపనలు చేసి అన్నాను మించిన తమ్ముడు అనిపించుకున్నారని కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి గారిని ప్రశంసించారు.
అనంతరం ఎమ్మల్సీ బీదా రవిచంద్ర, రూరల్ నియోజకవర్గ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గార్లు యువనేత లోకేష్ లోకేష్ గారి నాయకత్వ లక్షణాలను కొనియాడారు. మంత్రి లోకేష్ గారు పరిణితి చెందిన రాజకీయవేత్త రాటుదేలారని ఓ వైపు రాష్టంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడం లాంటి కార్యక్రమాలు చేస్తూనే ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తీరు చేస్తుంటే లోకేష్ గారు సిఎం చంద్రబాబు నాయుడు గారిని మించి పోయేలా వున్నారని ప్రశంసించారు. నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర భారతదేశ రాజకీయాలలో ఓ పెను సంచలనమని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి సోదరులు భారీ స్వాగతం చిరస్మరణీయమని అదే ఉత్సాహంతో యువగళం పాదయాత్ర విజయనగరం ముగింపు వరకు సాగిందన్నారు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పేర్కొన్నారు. నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒక గేమ్ చేంజర్ అని యువగళం పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలని సమూలంగా మార్చింది.టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

నెల్లూరు ఇంచార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ నెల్లూరు అభివృద్ధిని అడ్డుకుంటే చరిత్ర క్షమించదని ప్రతిపక్ష పార్టీ డ్రామాలు మాని వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. మీ కాలేజీల ముందు బంకులు పెడితే ఊరుకుంటారా అంటూ వైసిపి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని మేయర్ రూప్ కుమార్ యాదవ్ సూటి ప్రశ్నించారు. బంకుల యజమానులను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తారా అంటూ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. నెల్లూరు నగరాన్ని ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మంత్రి పొంగూరు నారాయణ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మరియు జిలా తెలుగుదేశం నాయకులు బీదా రవిచంద్ర, ఉపరితల జలరవాణా కార్పొరేషన్ ఛైర్మెన్ జెడ్ శివప్రసాద్, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, కేతంరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed