*అవును…సర్వేపల్లిలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్నది తప్పే*

*ఐదేళ్ల తర్వాత రైతుల భాగస్వామ్యంతో కాలువలను మెరుగ్గా తీర్చిదిద్దడం కాకాణి దృష్టిలో తప్పే*

*వైసీపీ ప్రభుత్వంలో తన లాగా ఒక్క 2023 డిసెంబరులోనే రూ.18.50 కోట్లను ఐదు ప్యాకేజీలుగా విభజించి భోంచేయలేదని కాకాణి గోవర్ధన్ రెడ్డి తెగ బాధపడిపోతున్నాడు*

*నక్కలకాలువలో పైపైనే కలిబెట్టి రూ.12 కోట్లు తినేయలేదని ఫీల్ అయిపోతున్నాడు*

*మొత్తంగా ఐదారు ప్యాకేజీల పేరుతో రూ.30 కోట్లు స్వాహా చేయకుండా రైతుల భాగస్వామ్యంతో పనులు చేస్తే ఎట్లా అని రగిలిపోతున్నాడు*

*తనలా ఏ ఊరిలో ఏ రైతుకు కూడా తెలియకుండా నిధులు స్వాహా చేసేయకుండా అన్నదాతలకు ఉపయోగపడేలా పనులు జరగడంతో జీర్ణించుకోలేకపోతున్నాడు*

*అది కూడా రూ.10 కోట్లతో 130కి పైగా పనులను( డీసిల్టింగ్, డ్రైన్స్) స్థానిక రైతుల భాగస్వామ్యంతో చేయడంతో తనకలాడిపోతున్నాడు*

*చేసిన పనులకే మళ్లీ మళ్లీ బిల్లులు చేసుకోవడం లేదని తెగ బాధపడిపోతున్నాడు*

*అసలు పనులే చేయకుండా తనలా బిల్లులు స్వాహా చేస్తేనే కాకాణి గోవర్ధన్ రెడ్డికి హ్యాపీ*

*ప్రజలందరికీ ఉపయోగపడేలా పారదర్శకంగా పనులు చేస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని తిట్టడానికే గోవర్ధన్ రెడ్డికి వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినట్టుంది*

*నకిలీ మాటలు..కల్తీ స్టేట్మెంట్లు ఇవ్వడానికే కాకాణికి జిల్లా బాధ్యతలు అప్పజెప్పినట్టున్నారు*

*ఎవరెన్ని మాట్లాడినా, ఎన్ని గావు కేకలు పెట్టినా సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదేళ్ల తర్వాత ఇరిగేషన్ వ్యవస్థ ఎంతలా బాగుపడిందో ఆయా గ్రామాల ప్రజలకు తెలుసు..ఆయకట్టు రైతులకు తెలుసు*

*తెలుగుదేశం పార్టీ – సర్వేపల్లి నియోజకవర్గం*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed