
*అర్జీదారులు అభ్యర్థించిన వివిధ సేవా అభ్యర్థనలను (Service Requests) నిర్ణీత సమయాల్లో పూర్తి చేయాలని సూచించిన కమిషనర్ వైఓ నందన్*
నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ. నందన్ వారాంతపు సమీక్షా సమావేశంలో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంగళవారము రెవిన్యూ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, సమయానుకూలంగా పరిష్కరించాలని ఆదేశించారు. పై విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయం జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నందున, ఎటువంటి అలసత్వం పనికిరాదని హెచ్చరించారు.
ప్రతి పరిపాలన కార్యదర్శి తమ సచివాలయ పరిధిలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు రెవిన్యూ వసూళ్లపై దృష్టి పెట్టాలని, అలాగే ఖాళీ స్థలాలను గుర్తించి పన్నులు విధించడంలో చురుకుగా వ్యవహరించాలని సూచించారు. కొత్తగా నిర్మించిన ఆస్తులు, అదనపు అంతస్తులు మరియు అపార్ట్మెంట్లకు వెంటనే పన్నులు విధించి ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు.
అలాగే, అర్జీదారులు అభ్యర్థించిన వివిధ సేవా అభ్యర్థనలను (Service Requests) నిర్ణీత సమయాల్లో పూర్తి చేయాలని సూచించారు.
డిసెంబర్ నెలలో జరగనున్న నేషనల్ లోక్ అదాలత్‌లో ₹25,000కు పైబడిన బకాయిలు ఉన్నవారిని గుర్తించి వారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. గతంలో నోటీసులు అందుకొని లోక్ అదాలత్‌కు హాజరుకాని వారు లేదా హాజరై బకాయిలు చెల్లించని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
రెవిన్యూ అధికారులు తమ పరిధిలో కనీసం ₹40 లక్షల రెవిన్యూ వసూళ్లు సాధించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
ఖాళీ స్థలాలకు పన్నులు విధించేందుకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది సహకారంతో లేఅవుట్లను గుర్తించాలని సూచించారు. ప్రతి రెవిన్యూ ఇన్స్పెక్టర్ తమ పరిధిలోని పరిపాలన కార్యదర్శులను ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ పన్ను వసూళ్ల ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, డిప్యూటీ డైరెక్టర్ మాధురి, టి.పి.ఆర్.ఓ. వాసు బాబు, రెవిన్యూ ఆఫీసర్లు సమద్, శ్రీనివాసులు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, అడ్మిన్ కార్యదర్శులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ.,
నెల్లూరు నగరపాలక సంస్థ.