*అభివృద్ధే మా నినాదం సంక్షేమమే మా విధానం*
– అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించండి.
– ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ద్వారా ప్రజలతో పార్టీకి అనుబంధం పెరుగుతుంది.
– విద్యాశాఖ మంత్రి లోకేష్ సారధ్యంలో ప్రభుత్వ విద్యారంగం బలోపేతం అయింది.
– ప్రజలతో మమేకమై ఏడాది పాలనలో ప్రభుత్వ విజయాలు వివరించండి.
– నియోజకవర్గ అభివృద్ధి కోసం CSR నిధులు అందచేస్తున్న ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
పేదలకు మంచి చేయాలన్న ఏకైక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. ఇందుకూరుపేట మండలంలోని డేవిస్ పేట, జగదేవి పేట గ్రామాలలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారితో కలిసి ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి మహిళలు అపూర్వ స్వాగతం పలికారు.. ఆమె ప్రజల నుంచి ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లకు సంబంధించిన వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ ఎక్కడికెళ్ళినా చాలా మంచి ప్రభుత్వమని ప్రజలు ప్రశంసిస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ లో భాగంగా ఆర్ధిక ఇబ్బందులను అధిగమించి ప్రభుత్వం అమలు చేసిన పెన్షన్ల పెంపు, ఉచిత సిలెండర్లు, తల్లికి వందనం పధకాల గురించి ఆమె ప్రజలకు వివరించారు.విద్యాశాఖామంత్రి లోకేష్ గారు చేపట్టిన విద్యా సంస్కరణలు సత్ ఫలితాలిస్తున్నాయన్నారు.
గతంలో నాలుగైదు తరగతులకు ఒకే టీచర్ ఉంటే ఇప్పుడు క్లాస్ కు ఒక టీచర్ నియామకం చేసాక ప్రజలు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చదించేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. నాణ్యమైన భోజనం, మరియు విద్యా కిట్లు అందచేసి ప్రభుత్వ పాఠశాలలను ప్రయివేట్ పాఠశాలతో పోటీ పడేలా అభివృద్ధి చేశారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడాన్ని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అన్నదాత సుఖీభవతో పాటు ఆగస్టు 15 నుంచి మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత బస్సు సోకార్యం కల్పిస్తున్నామన్నారు. త్వరలో పేదలకు ఇళ్ళు, ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామన్నారు. స్థానిక నాయకులు ఇంటింటికి తిరిగి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజలకు తెలియచేయాలని కోరారు. కోవూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం CSR నిధులు అందచేస్తూ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తున్న ఎంపి వేమిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ధన్యవాదాలు తెలియచేసారు.
*ప్రజాసేవ చేసేందుకే ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి రాజకీయాలలోకి వచ్చారు – ఎమ్మెల్సీ బీద రవిచంద్ర.*
తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు సేవ చేయడంతో పాటు కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న తపనతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు పని చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారితో కలిసి ఇందుకూరుపేట మండలంలోని డేవిస్ పేట, జగదేవి పేట గ్రామాలలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాలకు రాష్ట ప్రభుత్వ నిధులు మాత్రమే వస్తుంటే కోవూరు నియోజకవర్గంలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా కేంద్ర నిధులు కూడా వస్తున్నాయన్నారు. ప్రతి కార్యకర్త ప్రజలలోనికెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని కోరారు. కోవూరు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి సేవలను ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట టిడిపి మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, చెచుకిషోర్ యాదవ్, కోడూరు కమలాకర్ రెడ్డి, స్థానిక నాయకులు తన్నీరు మధు, కూకటి వెంకటేశ్వర్లు,కుదురు రాధయ్య, బొల్లినేని హరి నాయుడు, రవి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.