*”అన్నదాత పోరు సూపర్ సక్సెస్” – కాకాణి*

*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:09-09-2025*

*నెల్లూరు నగరంలోని విఆర్సీ కూడలి నుండి జిల్లా కలెక్టరేట్ వరకు రైతులతో కలిసి “అన్నదాత పోరు”కార్యక్రమాన్ని నిర్వహించి, జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందించిన మాజీ మంత్రి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ గారు, శాసనమండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ వైసిపి ఇంచార్జీ ఆనం విజయకుమార్ రెడ్డి గారు, కోవూరు యువజన విభాగం అధ్యక్షులు నల్లపురెడ్డి రజత్ కుమార్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి కాకాణి పూజితమ్మ గారు, రైతు సంఘ నాయకులు, తదితరులు.*

*పోలీసులు నోటీసులు జారీ చేసి, ప్రతి రోడ్డు మార్గాన బ్యారికేడ్లు ఏర్పాటు చేసి, రైతులు అడ్డుకున్న పరిస్థితి.*

*పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా, నిర్బంధించినా, అడ్డుకున్నా, భారీగా తరలివచ్చిన రైతులు.*

*తమ సమస్యలను పరిష్కరించాలంటూ, నెల్లూరు జిల్లా కేంద్రంలో కదంతొక్కి, నినాదాలు చేసిన అన్నదాతలు.*

*ఎన్ని ఆంక్షలు పెట్టినా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం చేపట్టిన “అన్నదాత పోరు” కు పోటెత్తి, పెద్ద ఎత్తున విచ్చేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రైతులకు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసిన మాజీ మంత్రి కాకాణి.*

*మాజీ మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ..*

– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుమేరకు కూటమి ప్రభుత్వ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అన్నదాత పోరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.

– కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోని రైతులు అనేక రకాలైన ఇబ్బందులకు, రోదనలకు గురవుతున్నారు.

– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలవాలనే లక్ష్యంతో అన్నదాతలతో కలిసి నడిచింది.

– ప్రతి రెవిన్యూ డివిజన్ల పరిధిలో రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆర్డీవోలకు వినతి పత్రం అందించేందుకు కార్యక్రమం చేపట్టాం.

– నెల్లూరు నగర, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, కోవూరు నియోజకవర్గాలకు సంబంధించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆనవాయితీ ప్రకారం, మహనీయుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి, రాజ్యాంగ స్ఫూర్తితో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి రైతుల సమస్యలపై వినతి పత్రం అందించాం.

– రైతుల సమస్యలపై కలెక్టర్ గారికి వినతిపత్రం అందించేందుకు రైతులతో కలిసి రావడానికి అనుమతి కోరితే, అర్ధరాత్రి నిబంధనలను పెడుతూ, అధికారులు ఉత్తర్వులు పంపడం దుర్మార్గం.

– రైతు సమస్యలపై మాట్లాడకూడదు, 15 మంది కంటే మించి, కార్యక్రమంలో పాల్గొనకూడదనే నిబంధనలు పెట్టారు.

– అన్నదాత పోరు కార్యక్రమంలో పాల్గొనకుండా, చెక్ పోస్టులు పెట్టడం, హౌస్ అరెస్టులు చేయడం, ఎక్కడికి అక్కడ రైతులను అడ్డుకున్నారు.

– కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ప్రశ్నిస్తే కక్ష సాధింపులు ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గం.

– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులు ఎన్నడూ రోడెక్కలేదు.

– ఏ సీజన్ లో రైతులు నష్టపోతే, ఆ సీజన్ లోనే, నష్టపరిహారం అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది.

– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎరువుల కోసం రైతులు ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా అందజేశాం.

– కూటమి ప్రభుత్వంలో 270/- రూపాయలు ఉన్న యూరియా బస్తా, 600 రూపాయలకు కూడా దొరకని పరిస్థితి.

– చంద్రబాబు అధికారులతో సమావేశాలు పెట్టి, రైతులు యూరియా కష్టాల గురించి మాట్లాడకూడదని బెదిరించడం సమంజసం కాదు.

– రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం తెచ్చిన లక్షల టన్నుల యూరియా రైతులకు అందకుండా ఏమైపోయింది.

– 50శాతం కంటే మించి, యూరియా ప్రైవేట్ వ్యాపారులకు ఇచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడటం రైతుల కడుపు కొట్టడమే.

– కూటమి ప్రభుత్వంలో కమీషన్లకు కక్కుర్తిపడి, రైతులను ఇబ్బందులు పెడుతూ, 200 కోట్ల రూపాయలు చేతులు మారాయి.

– రైతులు అతివృష్టి, అనావృష్టితో నష్టపోతుంటే, కూటమి ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుంది.

– వ్యవసాయం శుద్ధ దండగ అనే చంద్రబాబు, ఎప్పుడు అధికారంలో ఉన్నా రైతులకు అరిష్టమే.

– మహానేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రంలో వ్యవసాయం పండగలా చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆచరణలో చేసి చూపించారు.

– నెల్లూరు జిల్లాలో రైతుల రెండో పంటకు సంబంధించి గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడిపోతున్నారు..

– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పుట్టి(850కేజీలు) ధాన్యం 24వేలకు సంతోషంగా అమ్ముకుంటే, కూటమి ప్రభుత్వంలో 15వేలకు కూడా అడిగే వారు లేరని రైతులు మొరపెట్టుకుంటున్నారు.

– పంట దిగుబడికి వచ్చి 10 రోజులు కావస్తున్నా, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నుండి అధికారులకు ఆదేశాలు రాకపోవడం చూస్తుంటే రైతుల పట్ల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి అర్ధమవుతుంది.

– రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయకపోతే దళారులు రైతులను దోచుకుంటున్నారు.

– రైతులు ఎకరానికి 25వేల రూపాయలు నష్టపోతున్న పరిస్థితి.

– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, రైతులకు అండగా నిలిచారు.

– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వ్యాపారులు మార్కెట్ రేటు కంటే 25 శాతం ఎక్కువ రేటు పెట్టి ధాన్యం కొన్న పరిస్థితి.

– కూటమి ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లేక నష్టపరిహారం అందక ఆత్మహత్యలే శరణ్యమంటూ రైతులు బోరుమని విలపిస్తున్న పరిస్థితి.

– ఆరుకాలం కష్టపడి పండించిన రైతుల పంట గురించి ఆలోచన చేయకుండా, బనకచర్ల ప్రాజెక్టు కోసం చంద్రబాబు ఆరాట పడటం చూస్తుంటే, కమీషన్ల కోసం అమరావతిని ఎలా బంగారు బాతులా చేసుకున్నాడో అదే తీరును బనకచర్ల ప్రాజెక్టు విషయంలో అవలంభిస్తున్నాడు.

– *రైతుల ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలి..*

– *రైతులకు అవసరమైన యూరియా సహా, అన్ని రకాల అవసరాలను రైతు సేవా కేంద్రాల ద్వారా అందించాలి.*

– *యూరియా బ్లాక్ మార్కెట్ ను నిరోధించాలి.*

– *రైతులు పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి.*

– *ఉచిత బీమా పథకంలో ఈక్రాప్ విధానాన్ని కొనసాగించి రైతులకు నష్టపరిహారం అందించాలి.*

– *వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం అందించాలి* అనే డిమాండ్లతో జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందించాం.

– రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేయకపోతే, రైతుల సమస్యలను పరిష్కరించకపోతే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి, పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాం.

– నెల్లూరు జిల్లాలో నెల్లూరు, కందుకూరు, కావలి, ఆత్మకూరు, గూడూరు, సూళ్లురుపేట రెవిన్యూ డివిజన్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాత పోరుకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *