
*”అన్నదాత పోరు సక్సెస్ కు ధన్యవాదాలు” – కాకాణి*
*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:10-09-2025*
*నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జీలు, రైతు సంఘ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*
*ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మేరిగ మురళీధర్ గారు, మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య గారు, కోవూరు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు నల్లపురెడ్డి రజత్ కుమార్ రెడ్డి గారు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.*
*స్క్రోలింగ్ పాయింట్స్:*
– మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలోని రైతులు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారం కోసం అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించాం.
– ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కందుకూరు నియోజకవర్గంతో సహా, అన్ని నియోజకవర్గాలలో అన్నదాత పోరు కార్యక్రమం విజయవంతమైంది.
– అన్నదాత పోరు కార్యక్రమానికి నెల్లూరు, కావలి, ఆత్మకూరు, గూడూరు, సూళ్లూరుపేట, కందుకూరు రెవిన్యూ డివిజన్లలో పెద్ద ఎత్తున రైతులు పోటెత్తడం జరిగింది.
– కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్త్తుంది.
– ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉంది.
– ప్రధాన ప్రతిపక్షాలు ప్రజల పక్షాన నిలబడి ప్రజల సంక్షేమం కోసం నిరసనలు చేస్తారు.
– కూటమి ప్రభుత్వం మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలను అడ్డుకోవాలని పోలీసులను ఉసగొలిపి ప్రజలు రాకుండా నిలువరించే ప్రయత్నం చేస్తుంది.
– అన్నదాత పోరు కార్యక్రమంలో కూడా పోలీసులను ఉపయోగించి రైతులను ప్రజలను కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
– ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా తరలివచ్చి, అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని అడ్డుకోలేరని కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతాన్నిచ్చారు.
– పోలీసులను ప్రయోగించి ప్రజలను అడ్డుకోవడంతో ప్రభుత్వంపై ప్రజల్లో మరింత నిరసన వెలువెత్తుతుంది.
– అన్నదాత పోరు కార్యక్రమం విజయవంతం కాకూడదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, రైతులను హౌస్ అరెస్టులు చేశారు.
– అన్నదాత పోరు కార్యక్రమంలో పోలీసులు ఉత్సాహం చూపించారు.
– అర్ధరాత్రి సమయంలో నోటీసులు పంపించి, షరతులు అనుసరించాలని పోలీసులు చెప్పడం హాస్యాస్పదం.
– *15 మంది కంటే ఎక్కువ పాల్గొనకూడదు.*
– *పాల్గొనే 15 మంది కూడా ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకూడదు.*
– *5 మందికి మాత్రమే కలెక్టర్ వద్దకు వెళ్లేందుకు అనుమతి*
– *ప్రాణాంతకమైన ఆయుధాలు తీసుకొని వెళ్లకూడదు.*
– *చెప్పిన సమయానికే కార్యక్రమాన్ని మొదలుపెట్టి, ముగించాలి.*
– *మీడియా ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు నమోదు చేస్తామని* గొంతు నొక్కేందుకు అవసరమైన అన్ని షరతులు విధించి, అధికారులు అనుమతులు ఇచ్చారు.
– పోలీసులు నిర్వర్తించాల్సిన విధులను విస్మరించి, శాంతిభద్రతలను గాలికి వదిలేసి ప్రజలను అణగతొక్కే కొద్దీ ప్రజా వ్యతిరేకత ఎక్కువవుతుంది.
– యూరియా విషయంలో కూటమినేతలు చిలుక కొట్టుడు ఆపి, రైతుల గురించి ఆలోచన చెయ్యమంటే, ప్రభుత్వంలోని కూటమినేతలకు ఎందుకు కోపం వస్తుంది!
– 50 శాతం కంటే ఎక్కువగా ప్రైవేట్ వారికి యూరియా ఎందుకు వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చారు!
– *”యూరియా ఏదయ్యా”!* అంటూ టిడిపి పార్టీ అనుకూల మీడియా ప్రచురిస్తున్నా, చంద్రబాబు మాత్రం యూరియా గురించి మాట్లాడితే ఖబడ్దార్ అంటుండటం విడ్డూరం.
– చంద్రబాబు తెచ్చిన లక్షల టన్నుల యూరియా ఏమైంది!
– రైతులు క్యూలలో నిలబడి, బాధపడాల్సిన అవసరం ఏముంది!
– నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయలేదు!
– రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడం లేదన్న ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి.
– నియోజకవర్గాలలో అన్నదాత పోరు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన నియోజకవర్గ ఇన్చార్జి లకు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా.
– అన్నదాత పోరు కార్యక్రమంలో వేలాదిగా పాల్గొన్న జిల్లా రైతాంగానికి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తుంది.
– ప్రభుత్వం మెడలు వంచైనా సరే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అండగా నిలబడుతాం.