
**అటల్ దివస్ – సుపరిపాలన దిన వారోత్సవాలను జయప్రదం చేయండి.**
భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి మరియు అటల్ స్మృతి సంవత్సర వారోత్సవాలు నిర్వహణ కోసం బిజెపి జాతీయ పార్టీ అధ్యక్షులు నితిన్ నిబిన్ పిలుపుమేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్. మాధవ్ ఆదేశాలతో జిల్లా బిజెపి అధ్యక్షులు ఎస్. వంశీధర్ రెడ్డి సహకారంతో 5మెన్ కమిటీను ఏర్పాటు చేయడం జరిగింది. బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కు. రాధాకృష్ణ గౌడ్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సన్నీ గంటి. శీనయ్య బిజెపి ఉదయగిరి అసెంబ్లీ మాజీ కన్వీనర్ కంది. మల్లికార్జున రెడ్డి బీజేవైఎం మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉల్లం. శరత్ లను ఫైవ్ మెన్ కమిటీగా రాష్ట్ర శాఖ నియమించడంతో వీరు జిల్లా బిజెపి కార్యాలయంలో సమావేశమై చేయవలసిన కార్యక్రమాలను గూర్చి చర్చించడం జరిగింది.
కార్యక్రమాలలో భాగంగా వాజ్ పేయి రాజకీయ ప్రస్థానం, మౌలిక సదుపాయాలు, విదేశాంగ విధానం, ప్రజా సంక్షేమ రంగాలలో చేసిన ముఖ్యమైన సంస్కరణలతో సహా సుపరిపాలన కొరకు చేసిన కృషిని ఒక ఉత్సవంగా జరపడం, బూత్ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు కార్యకర్తలను సమీకరించి పార్టీ వ్యవస్థను బలోపేతం చేయడం వాజ్ పేయి వారసత్వ సంరక్షకుడిగా పార్టీ పాత్రను మరింత పటిష్టం చేయడం ఆయన సందేశంలో దేశం ప్రథమం అనే విలువలను హైలైట్ చేసి వారి వారసత్వాన్ని వికసిత భారత్ దిశగా ముందుకు తీసుకెళ్లడం దేశవ్యాప్త భాగస్వామ్యంలో అన్ని కార్యకలాపాలను నిర్వహించి పౌరులకు, యువతకు ప్రేరణ ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు.
అలాగే రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలలో కార్యశాలలు నిర్వహించడం డిసెంబర్ 24న వాజ్ పేయి విగ్రహాలను, స్మారక చిహ్నాలు వద్ద స్వచ్ఛత కార్యక్రమాలు, రాష్ట్ర, జిల్లా బిజెపి కార్యాలయాల వద్ద దీపాలు వెలిగించడం, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో సమ్మేళనాలు నిర్వహించడం, డిసెంబర్ 25 నుంచి 31వ తేదీ వరకు వారోత్సవాలలో భాగంగా మండల స్థాయిలో పార్టీ కార్యాలయాలో అటల్ చిత్రపటాలకు పూలమాలంకరణ చేసి ఒక పండగ వాతావరణం లో సమావేశాలు నిర్వహించడం, అటల్ స్మృతి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అన్ని నగరపాలక సంస్థలు మరియు విధాన పరిశోధన సంస్థలలో సుపరిపాలన సమ్మేళనాలు నిర్వహించడం నగరాల్లోని కూడళ్ళుకు, పార్కులకు వాజ్ పేయి పేరు పెట్టడం నూతనంగా విగ్రహాలను స్థాపించడం, దానితో పాటుగా అటల్ వన్ పేరుతో ఉద్యానవనాలను అంకితం చేస్తూ ఒక ప్రత్యేక పథకాన్ని కూడా చేయాలని జిల్లా స్థాయిలోనూ మరియు ప్రముఖ నగరాలలో కవి సమ్మేళనాలు, చిత్రకళా పోటీలు, గ్రాఫిక్స్, రీల్ పోటీలు క్విజ్ పోటీలు, ముగ్గుల పోటీలు, వ్యక్తిత్వ వికాస పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సంపాదకీయ వ్యాసాలు రాయడం, యూట్యూబ్ కంటెంట్, మరియు వలాగింగ్ కూడా ప్రోత్సహించడం తదితర కార్యక్రమాల ద్వారా వాజ్ పేయి జీవితము సాధించిన విజయాల ఆధారంగా రూపొందించే గ్రాఫిక్స్ మరియు రీల్స్ సోషల్ మీడియాలో మాధ్యమాలలో పోస్ట్ చేయడం జరుగుతుందని వారు తెలిపారు.
అలాగే జిల్లాలోని అన్ని మోర్చాలు మరియు కమిటీలు సహా ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ ఈ అభియాన్ యొక్క ప్రణాళిక మరియు అమలలో భాగస్వాములు అవ్వాలని వారు పిలుపునిచ్చారు.
భవదీయ,
ముక్కు రాధాకృష్ణ గౌడ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చాఉపాధ్యక్షులు.