*గోదావరి బనకచర్ల ప్రాజెక్టు హై రిస్కూతో కూడుకుంది*

కృష్ణా జలాలలో గోదావరి జలాలు కలిపితే ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 80 టీఎంసీల *కృష్ణా జలాలను నాలుగు రాష్ట్రాలు పంచుకోవలసి వస్తుంది*

అంతర్ రాష్ట్ర వివాదాలు తలె త్తకుండా అప్రూవల్ పొందిన నాగార్జునసాగర్ కుడి కాలవ నుండి నీటిని తరలించుకోవాలనీ
బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ తెలుగు గంగ పర్యవేక్షణ అధికారి రాధాకృష్ణారెడ్డి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి జలాలను కృష్ణా జలాలకు మళ్లించి వాటిని బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుండి నీటి పంపిణీ చేయాలని నిర్ణయించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోనికి తీసుకుంటే ఈ ప్రాజెక్టుకు 80, 112 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంచిన.
గోదావరి నది జలాలు 150 అడుగుల లో ఉంటే బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ 800 అడుగుల కంటే ఎత్తులో ఉంది లిఫ్ట్ ఇరిగేషన్ భారీ వేలుతో కూడుకున్నది.
గోదావరి జలాలు కృష్ణా జలాలను తాకకుండా తాడిపూడి ఎత్తిపోతల నుండి వరద కాలువల సామర్థ్యం పెంచి బొల్లాపల్లి రిజర్వాయర్ నుండి నల్లమల సాగర్ కు నల్లమల సాగర్ నుండి బనకచర్లకు నీటిని తరలించడం మంచిదని అంతర్రాష్ట్ర వివాదాలు ఏర్పడవని రాష్ట్రంలోని ఇరిగేషన్ నిపుణులు .విశ్రాంత ఇంజనీర్లు సూచిస్తున్నారు

*అప్రూవల్ పొందిన ప్రాజెక్ట్ ను వినియోగించుకోవాలి*

నాగార్జునసాగర్ కుడి కాలవ నుండి సోమశిల కు నీటిని తరలించేందుకు అన్ని అనుమతులు ఉన్నాయి. కేంద్ర జల సంఘం ఆమోదం కూడా ఉంది. సర్వే జరిపి అలైన్మెంట్ రాళ్లను నెల్లూరు జిల్లా బీరా పేరు వరకు వేసి ఉన్నారు.అక్కడనుండి సోమశిల జలాలతో కలిపి వినియోగించుకునేటట్లు ప్రతిపాదనలు ఉన్నాయి.
సాగర్ కుడి కాలువ 80 కిలోమీటర్ల వద్ద నుండి బొల్లాపల్లి రిజర్వాయర్ కు నీటిని మళ్లించి ఆ నీటిని నల్లమల సాగర్
నల్లమల సాగర్ నుండి క్రాస్ ఫీడర్ ద్వారా బనకచర్లకు నీటిని మళ్లించవచ్చు.
పర్యావరణ అనుమతులు- రాష్ట్ర బడ్జెట్ _గ్రావిటీ ద్వారా నీరు _అంతర్రాష్ట్ర వివాదాలు వీటిని దృష్టిలో ఉంచుకొని నీటిని తరలించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని మిడతల రమేష్ రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో నరాల సుబ్బారెడ్డి .నీలి శెట్టి లక్ష్మణరావు . పైడిమాని ఆదినారాయణ .నారాయణ.సుబ్బయ్యా తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *