*తేదీ : 01-05-2025*
*నెల్లూరు*

*YSRCP జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు*

నగరంలోని వైఎస్ఆర్సిపి జిల్లా పార్టీ కార్యాలయంలో YSRTUC జిల్లా అధ్యక్షుడు జయ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు శ్రీ మేరుగ మురళీధర్ గారు, శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారు, శ్రీ కిలివేటి సంజీవయ్య గారు, శ్రీ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఈ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గార్ల చేతుల మీదుగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా మొదట YSRTUC జండా ఆవిష్కరించి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం నెల్లూరు రూరల్ సమన్వయకర్త శ్రీ ఆనం విజయకుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ

👉 ప్రపంచంలోని కార్మికుల సమస్యల పైన, అపరిమిత పనిగంటలు, సరైన జీతభత్యాలు ద్వారా కార్మికులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న సమయంలో ప్రపంచంలోని అనేక కార్మిక సంఘాలు పోరాటాలు చేసి , ప్రాణ త్యాగాలు చేసి కార్మికుల హక్కుల పై సాధించిన విజయానికి చిహ్నంగా మరియు 18 శతాబ్దంలో చికాగో నగరంలో జరిగిన మారణకాండ కు గుర్తుగా ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన ఈ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాము.

👉 ఆనాడు కార్మికుల హక్కుల కోసం పోరాడిన వారి పోరాట పటిమను, త్యాగాలను స్వర్ణ చేసుకోవడమే ఈనాటి ముఖ్య ఉద్దేశం.

👉 భారతదేశంలో కూడా అదుపుతప్పిన పనివేళలు, వెట్టి చాకిరి, ద్వారా ప్రజలను కార్మిక వర్గాలను పీడించే సంపన్న వర్గాల మరియు పారిశ్రామికవేత్తల ఆలోచనలకు వ్యతిరేకంగా ఎంతోమంది పోరాడి , ప్రాణ త్యాగాలకు సిద్ధపడి రోజుకు 8 గంటల పని వేళలు, ఒక రోజు సెలవు, కార్మికుల కోసం అత్యవసర సేవలు అవసరమని ఆనాడు కార్మిక లోకం చేసిన పోరాట ఫలితమే ఈనాడు కార్మికులు అనుభవిస్తున్నారు.

👉 ఆ కార్మికుల త్యాగాలకు గుర్తుగా ఏర్పాటు చేసిన ఈనాటి కార్మిక దినోత్సవ కార్యక్రమంలో వారందరికీ మా పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

👉 మా పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తను అధికారంలో ఉన్న సమయంలో కార్మిక వర్గాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అనేక రకాల సంక్షేమ పథకాల ద్వారా వారికి సాయం చేయడం జరిగింది.

👉 జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఆటో డ్రైవర్లను, నాయి బ్రాహ్మణులు, చేనేతలు, మత్స్యకారులు, టైలర్లు మొదలగు వారందరికీ ఏదో ఒక రూపంలో ఫలాలు అందించడం జరిగింది.

👉 ఆటో డ్రైవర్లు, టైలర్లు, నాయి బ్రాహ్మణులకు సంవత్సరానికి 10000 రూపాయలు, చేనేతలకు సంవత్సరానికి 24000, మత్స్యకారులకు మత్స్యకార భరోసా , మహిళలకు చేయూత చేదోడు వంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా అండగా నిలవడం జరిగింది.

👉 కార్మికులకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆరోజు ఆరోగ్యశ్రీ పథకంలో అనేక వ్యాధులను చేర్చడంతోపాటు , స్థానికంగా ఉండే ఆరోగ్య కేంద్రాలను అత్యున్నతంగా అభివృద్ధి చేయడం జరిగింది.

👉 జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ జిల్లాలో మేమందరం ఒక్కటిగా ఉండి కార్మికులకు సంబంధించిన ఏ సమస్య పైన అయినా ప్రభుత్వంతో పోరాడాల్సి వస్తే కార్మికులకు అండగా మేమందరం ఉంటామని హామీ ఇస్తున్నాం.

👉 మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే కార్మికులకు అండగా ఉండే అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలియజేస్తూ మరోసారి కార్మికులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.

*ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు, భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed