V.R HIG SCHOOL కు పూర్వ వైభవం తీసుకు వస్తాం.
నేను6 నుంచి 10వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నా
రాష్ట్రంలోనే బెస్ట్ స్కూల్ గా V.R HIG SCHOOL చేస్తాం.
రాష్ట్రంలో నాలుగు ప్రాంతంలో కార్పొరేట్ స్థాయిలో స్కూల్ నుంచి జూనియర్ కాలేజ్ వరకు విద్యను అందించేందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అంగీకరించారని రాష్ట్ర మునిసిపాల్,ఆర్బన్ డెవలెప్ మెంట్ శాఖ మంత్రి డాక్టరు.పొంగూరు.నారాయణ తెలిపారు.మంగళవారం నెల్లూరు నగరంలోని V.R HIG SCHOOL మంత్రి సందర్శించారు.అనతంరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ 2025 విద్యా సంవత్సరంలో స్కూల్,జూనియర్ కాలేజ్ లను అందించేందుకు విద్యాశాఖ&మునిసిపాల్ శాఖలు సంయుక్తంగా కార్యాచరణ సిద్దం చేసుకుంటున్నాయని వెల్లడించారు.గతంలో తాను V.R HIG SCHOOLల్లో ప్రారంభించిన రెసిడెన్సీల్ కాలేజ్ లో పేద వర్గాలకు చెందిన దాదాపు 300 విద్యార్ధిని విద్యార్దులు చదువుకున్నరని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెసిడెన్సీల్ కాలేజ్ మూసివేసిందని అవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే బెస్ట్ స్కూల్ గా V.R HIG SCHOOLను తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ,,టీడీపీ నాయకురాలు టీ.అనూరాధ,విజేత తదితరులు పాల్గొన్నారు.