*PM-JANMAN పథకం కింద చేపట్టిన అంగన్‌వాడీ భవనాలు పూర్తయ్యాయా..? : వేమిరెడ్డి. ప్రభాకర్ రెడ్డి*

ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (PM-JANMAN) కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2500 అంగన్వాడీ కేంద్రాలను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందా అని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు ప్రశ్నించారు. శుక్రవారం లోక్‌సభలో ఈ విషయమై ఆయన పలు అంశాలపై ఆరా తీశారు. పథకం కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జిల్లాల వారీగా అంగన్‌ వాడీల ప్రస్తుత స్థితి వివరించాలని కోరారు. వీటి నిర్మాణానికి అధిక సమయం, ఖర్చు పెరగడానికి గల కారణాలు వివరించాలన్నారు.

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారి ప్రశ్నలకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రి ఠాకూర్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. దేశంలోని 18 రాష్ట్రాలు, ఒక UTలో నివసిస్తున్న 75 గిరిజన తెగల (PVTGs) సంక్షేమాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని PM JANMAN మిషన్ ను రూపొందించిందన్నారు. ఈ మిషన్ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖతో సహా 9 మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 11 క్లిష్టమైన అంశాలపై దృష్టి సారిస్తుందన్నారు. 2023-24, 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో 2500 అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేసిందని వివరించారు. ఒక్కో అంగన్‌వాడీ కేంద్రాన్ని రూ. 12 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నామన్నారు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం, ప్రాజెక్టుల అమలులో ఎటువంటి జాప్యాలు, అదనపు వ్యయాలు లేవని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *