*NDA కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం జనసేన నేత —- నూనె మల్లికార్జున్ యాదవ్*

ఇటీవ‌ల జ‌న‌సేన అధినేత కొణిద‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మ‌క్షంలో…వైసీపీ నాయ‌కుడు నూనె మ‌ల్లికార్జున యాద‌వ్ జ‌న‌సేన తీర్ధం పుచ్చుకున్న విష‌యం అంద‌రికి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా…

తెలుగుదేశం పార్టీ మాజీ పొలిట్ బ్యూరో సభ్యులు సర్వేపల్లి NDA కూటమి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారిని బిజెపి జిల్లా అధ్యక్షుడు వంశి రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూనె మల్లికార్జున యాదవ్.

_*నూనె మల్లికార్జున్ యాదవ్ మాట్లాడుతూ*_

జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున తెలుగుదేశం, బిజెపి, నాయకులను మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని వారితో కలిసి నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తామని NDA కూటమి అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా జనసేన పార్టీ అహర్నిశలు కష్టపడుతుందని నూనె మల్లికార్జున యాదవ్ తెలిపారు.

రాష్ట్రంలో రావణ రాజ్యం పొయ్యి రామరాజ్యం రావాలంటే ప్రజలందరూ NDA కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని తెలిపారు.

రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదని ప్రజలను వైసిపి ప్రభుత్వం మాయమాటలు చెప్పి మోసం చేసిందని ప్రజలందరూ కూడా మళ్లీ వైసిపి ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితులు రాష్ట్రంలో ఎక్కడా లేవని నూనె మల్లికార్జున్ యాదవ్ తెలిపారు

నెల్లూరు జిల్లాలో అభివృద్ధి జరిగింది ఒక్క తెలుగుదేశం పార్టీ హయాంలోనేనని వైసిపి ప్రభుత్వం వచ్చాక ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే వారిపై తప్పుడు కేసులు బనాయించి వారిని అణిచివేశారని అన్నారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా గంజాయి కి బానిసలుగా మార్చిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ని ప్రజలందరూ కూడా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుండి తరిమికొట్టాలని కోరారు .

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి సుందర్ రామిరెడ్డి , జనసేన నేతలు వేటూరి రవికుమార్ , కారంపొడి కృష్ణారెడ్డి, గునుకుల కిషోర్, బొద్దేపల్లి సురేష్ నాయుడు , పవన్ యాదవ్, గుర్రం కిషోర్, భవాని, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed