*DEO లు టీచర్ల ను పెడుతున్న ఇబ్బందులు, చేస్తున్న అవినీతి గురించి.*….
*MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కొన్ని ఆదారాలను ఇవ్వడం తో పాటు విచారణ చేయాలని శాసన మండలిలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*
*MLC చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్…*
¡ ) అమాయక టీచర్లకు మరియు సిబ్బంది కి సంబంధిత DEO లు చిన్న ఛిన్న కారణాలతో విపరీతంగా మెమో లు ఇస్తున్నారు.
స్వలాభం కోసం విపరీతంగా వారిని వేదిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు . ఇందులో అనేకమందిని అకారణంగా సస్పెండ్ చేసి ఇబ్బంది పెట్టారు, పెడుతున్నారు. ఈ సమాచారన్ని జిల్లాల వారీగా తెప్పించి చర్యలు తీసుకోవలసినదిగా కోరారు
¡¡ ) అనేక DEO, MEO ఆఫీసులలో అనధికార వ్యక్తుల ప్రమేయం ఎక్కువ అయి ఉపాధ్యాయులను వేదిస్తున్నారని..
¡¡¡) ప్రధానంగా ఎప్పుడూ లేని విధంగా ఇటీవల MLA ల యొక్క రాజకీయ పార్టీ ఆఫీసులలోనే DEO, MEO లు సమీక్షా సమావేశలు నిర్వహించి రాజకీయ నాయకులు ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నారు. తద్వారా ప్రజలలో, ఉపాధ్యాయులలో తీవ్ర అసహనం కలుగుతావుంది. దీని మీద రిపోర్ట్స్ తెప్పించగలరని కోరారు…
¡¡¡¡) ప్రైవేట్ స్కూల్స్ గుర్తింపు తో పాటు తనిఖీలు పేరుతొ DEO ల అవినీతి పెరిగిపోయింది అని ప్రైవేట్ స్కూల్స్ ఆవేదన చెందుతున్నారని తెలిపారు
ఈ నాలుగు అంశాల మీద రాష్ట్ర స్థాయిలో ఎంక్వయిరీ చేయించి, సరి అయిన నివేదిక తెప్పించుకొని తప్పు చేసిన వారి మీద చర్యలు తీసుకొని విద్యా వ్యవస్థ పవిత్రతను కాపాడమని చంద్రశేఖర్ రెడ్డి కోరారు