APTIDCO గృహాల కేటాయింపు జరిగినప్పటికీ నిర్మాణాలు పూర్తికాని సందర్భంగా కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశాల మేరకు నిరుపేదలు, దివ్యాంగులు, వృద్ధాప్య దశలో ఉన్న 12 మందికి తాత్కాలిక ప్రాతిపదికన గృహాలను కేటాయిస్తూ  ఉత్తర్వులను జారీ 

 

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు APTIDCO గృహాల కేటాయింపు జరిగినప్పటికీ నిర్మాణాలు పూర్తికాని సందర్భంగా కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశాల మేరకు నిరుపేదలు, దివ్యాంగులు, వృద్ధాప్య దశలో ఉన్న 12 మందికి తాత్కాలిక ప్రాతిపదికన గృహాలను కేటాయిస్తూ కమిషనర్ గురువారం ఉత్తర్వులను జారీ చేశారు.

ఈ మేరకు అర్హులైన లబ్ధిదారులకు కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో 12 మందికి తాత్కాలిక నివాస ఉత్తర్వులను కమిషనర్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో హౌసింగ్ విభాగం సూపరింటెండెంట్ పద్మ, సిబ్బంది పాల్గొన్నారు.

పి.ఆర్.ఓ.
నెల్లూరు నగర పాలక సంస్థ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *