- _*విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో డా. మన్మోహన్ సింగ్ గారికి ఘన నివాళులు…*_
…….
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో డా. మన్మోహన్ సింగ్ గారికి ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయ భాస్కర రావు గారు, రిజిస్ట్రార్ డా. కె. సునీత గారు, అధ్యాపకులు, విద్యార్థులు కలిసి డా. మన్మోహన్ సింగ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించారు.
అనంతరం, డా. మన్మోహన్ సింగ్ గారి దేశానికి చేసిన అపూర్వమైన సేవల్ని గుర్తుచేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా ఉపకులపతి గారు మాట్లాడుతూ, “డా. మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లాయి. ఆయన దూరదృష్టి, నాయకత్వం దేశ అభివృద్ధికి నూతన ఆర్ధిక విధాన రూపకల్పనద్వార ప్రగతి సాదించారు.
అలాగే, రిజిస్ట్రార్ డా. కె. సునీత గారు మాట్లాడుతూ, “డా. మన్మోహన్ సింగ్ గారి జీవితం, నిరుపమానమైన నాయకత్వం, విధేయత యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరికి బాధ్యత,” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ విజయ, ఆచార్య సూజా ఎస్ నాయక్, పరిక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఆర్.మధుమతి, ఎన్ ఎస్ ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఉదయ శంకర్ అల్లం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ బి.వి.సుబ్బారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు, ఆయన ఆశయాలను కొనసాగించేందుకు కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేశారు.