_*వి.ఎస్.యూ లో 27, 28 నేషనల్ సైన్స్ డే వేడుకలు – Open House 2025…*_

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఫిబ్రవరి 27 & 28 తేదీలలో నేషనల్ సైన్స్ డే సందర్భంగా Open House 2025 ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అవగాహన పెంచేందుకు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయ బడ్డాయి.

కార్యక్రమ విశేషాలు:🔬 ప్రత్యక్ష ప్రయోగాలు📡 విజ్ఞాన ప్రదర్శనలు🎭 ప్రదర్శనలు & పోటీలు

ప్రధాన థీమ్:”Viksit Bharat కోసం భారత యువతకు గ్లోబల్ సైన్స్ & ఇన్నోవేషన్ నాయకత్వాన్ని అందించడం”

ఈ వేడుకలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయ భాస్కర రావు గారు మరియు రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత గారు గౌరవప్రదంగా గోడపత్రాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య ఎస్. విజయ భాస్కర రావు గారు మాట్లాడుతూ, 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు మరియు డిగ్రీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని, విజ్ఞాన ప్రదర్శనలు, ప్రత్యక్ష ప్రయోగాలు మరియు పోటీల ద్వారా తమ శాస్త్రీయ అవగాహనను పెంపొందించుకోవాలని సూచించారు.

అలాగే, భారత యువతను గ్లోబల్ లీడర్షిప్‌కు సన్నద్ధం చేయడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో సహాయపడతాయని, శాస్త్రసాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు చేసేందుకు విద్యార్థులు ముందుకు రావాలనీ ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో కన్వీనర్ డాక్టర్ కోట నీల మణికంఠ, డీన్ సి డి సి డాక్టర్ ఎం హుస్సేనయ్య, డాక్టర్ ఎన్ వో గోపాల్ డాక్టర్ సి ఎస్ సాయి ప్రసాద్ రెడ్డి ఎఫ్ ఓ సిహెచ్ చాముండేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed