_*వి ఎస్ యూ లో సోలార్ డిహైడ్రేషన్ పై ప్రత్యేక కార్యక్రమం*_
…………
విశ్వవిద్యాలయ ఫుడ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో “సోలార్ డిహైడ్రేషన్” పై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతు స్ఫూర్తి ఫార్మర్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కే. బాలచందర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన సోలార్ డిహైడ్రేషన్ విధానం, ఉపయోగాలు వివరించారు. వివిధ కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, అల్లం, కరివేపాకు, క్యారెట్, బీట్రూట్, మామిడి మొదలైన వాటిని సోలార్ డిహైడ్రేషన్ ద్వారా ప్రాసెస్ చేయడం గురించి ప్రాక్టికల్ డెమో ప్రదర్శించారు.
సోలార్ షెడ్డు నిర్మాణం, పెట్టుబడి, ఉత్పత్తి సామర్థ్యం, ప్రాసెసింగ్ విధానం వంటి అంశాలను వివరించారు. మార్కెట్ లేనప్పుడు మిగిలిపోయే టమాటాలు, నిమ్మకాయలు, అల్లం తదితర కూరగాయలను సోలార్ డిహైడ్రేషన్ ద్వారా నాణ్యత కోల్పోకుండా నిల్వ చేసే పద్ధతులను సూచించారు. డిహైడ్రేటెడ్ ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ చేసే విధానం, ప్యాకేజింగ్, అంతర్జాతీయ మార్కెటింగ్ వ్యూహాలు మరియు ఎగుమతికి అవసరమైన విధివిధానాలను వివరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రయోగాలకు ఉపయోగపడేలా ఒక సోలార్ డిహైడ్రేషన్ నమూనా మోడల్‌ను విశ్వవిద్యాలయానికి బహుకరించారు. అనంతరం, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. కె. సునీత గారు బాలచందర్ గారిని శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఫుడ్ టెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎస్. బి. సాయినాథ్, అధ్యాపకులు డాక్టర్ జె. నాగరాజు, షేక్ పర్వీన్ భేగం, డాక్టర్ భావన, డాక్టర్ పావని, డాక్టర్ శారద, ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.