*వి.ఎస్.యూ లో నూతన అంబులెన్స్ ప్రారంభం…*_
_*విశ్వవిద్యాలయ ఉపకులపతి, యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ చేతుల మీదుగా ఆవిష్కరణ*_
నెల్లూరు: కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (వి.ఎస్.యూ) విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది కోసం అత్యవసర వైద్య సేవలను మెరుగుపరిచే దిశగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా విశ్వవిద్యాలయానికి నూతన అంబులెన్స్‌ను అందజేసింది.
ఈ అంబులెన్స్‌ను విశ్వవిద్యాలయ ప్రాంగణంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ శ్రీ ఏ. రాజశేఖరం సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి మాట్లాడుతూ,
“విద్యార్థులు మరియు సిబ్బంది ఆరోగ్య భద్రత కోసం ఈ అంబులెన్స్ ఎంతో అవసరం. అత్యవసర సమయాల్లో తక్షణ వైద్య సహాయం అందించేందుకు ఇది కీలక భూమిక పోషిస్తుంది. ఈ సహాయాన్ని అందించిన యూనియన్ బ్యాంక్‌కు మా హృదయపూర్వక కృతజ్ఞతలు,” అని తెలిపారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ శ్రీ ఏ. రాజశేఖరం మాట్లాడుతూ,
“సమాజ సేవలో భాగంగా మేము ఎల్లప్పుడూ విద్యా సంస్థల అభివృద్ధికి సహాయపడతాము. ఈ అంబులెన్స్ విశ్వవిద్యాలయానికి ఎంతో ఉపయోగపడుతుందని మా నమ్మకం,” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత,విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై .విజయ, పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్, కావలి ప్రిన్సిపాల్ ఆచార్య టి.వీరరెడ్డి, డాక్టర్ సిఎస్.సాయి ప్రసాద్ రెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్, బ్రాంచ్ మేనేజర్ ఆర్. రామ్మోహన్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు, బ్యాంక్ అధికారులు హాజరయ్యారు.