_*వి ఎస్ యూ లో జాబ్ మేళా విజయవంతం – 33 మందికి ఉద్యోగ అవకాశాలు….*_
………………………….
విక్రమ సింహపురి యూనివర్సిటీలో మార్చి 4న నిర్వహించిన జాబ్ మేళా విజయవంతంగా పూర్తయింది. ఈ మేళాలో మొత్తం 69 మంది అభ్యర్థులు హాజరయ్యారు, వారిలో 33 మంది ఉద్యోగ అవకాశాలను పొందారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జిల్లా ఏంప్లాయమెంట్ ఆఫీసు మరియు సీడాప్ సంయుక్తంగా నిర్వహించిన ఈ మేళాలో AU Small Finance Bank, Credit Access Grameen Ltd, Act Fiber Net, Shriram Fortune Solutions Co. Ltd వంటి ప్రముఖ సంస్థలు పాల్గొన్నాయి. కంపెనీల నుండి వచ్చిన ప్రతినిధులు అభ్యర్థులను ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హతల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ జె.విజేత, పి జనార్ధన్ ఏపిఎస్ఎస్ డి ప్లేస్ మెంట్ ఆఫీసర్, ఎ.జేసయ్య జాబ్ కోఆర్డినేటర్ Seedap, మరియు కంపెనీల ప్రతినిధులు పాల్గొనారు.