_*వి ఎస్ యూ లో ఘనంగా 17 వ జాతీయ బాలికా దినోత్సవం….*_
…………………
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉమెన్ సెల్ మరియు ఎన్ఎస్ఎస్ సమన్వయంతో, ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా, నెల్లూరు వారు కలిసి 17వ జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ, “ఆడవారు అన్ని రంగాల్లో తమ ప్రతిభను నిరూపిస్తున్నారు. బాలికల హక్కులు, విద్య, ఆరోగ్యం, శ్రేయస్సు పెంపొందించడంలో అందరూ సహకరించి, సమాజంలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరు ఈ చర్యల్లో భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు.
డాక్టర్ పసుపులేటి వసుమతి ఎం.బి.బి.ఎస్., డి.ఎన్.బి గారు, విశిష్ట అతిథిగా పాల్గొని విద్యార్థులకు పిసిఓడీ (Polycystic Ovary Syndrome) పై అవగాహన కల్పించారు. న్యూట్రిషనల్ డిఫిషియెన్సీ (పోషకాహార లోపం) మరియు సర్వైకల్ క్యాన్సర్ పై వివరణాత్మకంగా మాట్లాడారు. కార్యక్రమంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, పిసిఓడీ పై ఉన్న అపోహలను నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమానికి డాక్టర్ యం. హనుమారెడ్డి గారు అధ్యక్షత వహించగా, డాక్టర్ ఆర్. మధుమతి కార్యనిర్వాహకులుగా వ్యవహరించారు. డాక్టర్ కె. సునీత, డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం, మరియు డాక్టర్ ఎస్. వేణుగోపాల్ గార్లు వక్తలుగా పాల్గొని, బాలికల ఆరోగ్యం మరియు విద్య గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
కార్యక్రమాన్ని డాక్టర్ జి. సాయి స్రవంతి గారు వందన సమర్పణ ద్వారా ముగించారు.