_*వి ఎస్ యూ లో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్…*_
*అమరవీరుల త్యాగానికి ఘన నివాళి – దేశభక్తి అభివృద్ధికి ఉపన్యాసకుల పిలుపు*

*నెల్లూరు, జూలై 26:* కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని సర్ సి.వి. రామన్ సెమినార్ హాల్ నందు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఘనంగా కార్యక్రమం నిర్వహించబడింది. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయం సింహపురి వైద్యసేవా సమితి నెల్లూరు వారి అనుబంధముగా నిర్వహించింది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. కె. సునీత అతిథిగా హాజరై, మాట్లాడుతూ, “దేశాన్ని రక్షించేందుకు ప్రాణాలను అర్పించిన కార్గిల్ యుద్ధ వీరుల త్యాగం అనిర్వచనీయమైనది. విద్యార్థులు ఆదేశభక్తిని తమ జీవితాల్లో ఆచరణలో పెట్టాలి. దేశసేవా భావం, నైతికత మనలో ఉండాలి.” “మా కుటుంబంలో దేశ సైన్యంలో సేవ చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. అలాంటి కుటుంబంలో పుట్టినందుకు నాకు గర్వంగా ఉంది. “ఇప్పటి తరం యువత కార్గిల్ అమర వీరుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని, సేవా దృక్పథంతో సమాజంలో మార్పు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. విద్యను దేశానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుకోవాలి,” అని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
గౌరవ అతిథిగా విచ్చేసిన శ్రీ ఎన్.వి. సుబ్బారావు, ట్రైబల్ ప్రాజెక్ట్ జిల్లా కోఆర్డినేటర్, మాట్లాడుతూ, “కార్గిల్ వీరులు ఆదర్శప్రాయులు. దేశభక్తి కేవలం యుద్ధ రంగానికి పరిమితం కాదు; అది ప్రతి పౌరుడి జీవితంలో సేవారూపంలో వ్యక్తమవుతుంది.” విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. విజయ గారు మాట్లాడుతూ, “కార్గిల్ విజయ్ దివస్ అనేది త్యాగానికి, ధైర్యానికి, దేశభక్తికి ప్రతీక. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందిస్తాయి.” “విద్యార్థులు పాఠ్యబోధనలోనే కాకుండా, సమాజంలో మార్పు తీసుకొచ్చే పౌరులుగా ఎదగాలి. దేశాన్ని ప్రేమించడం అనేది కార్యాలలో వ్యక్తం కావాలి,” అని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో 2 నిమిషాల మౌనం పాటించగా, అనంతరం శ్రీ ఎన్.వి. సుబ్బారావును విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. కె. సునీత మరియు ప్రిన్సిపాల్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో డా ఆర్ ప్రభాకర్, పి.ఆర్.ఓ డా కోట నీల మని కంట, ఇంగ్లీష్ విభాగ అధిపతి డా శ్యాం సుందర్ భగవాన్, డా యం. ఒబులపతి, మరియు విశ్వవిద్యాలయ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed