_*వి.ఎస్.యూ.లో ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ (మహిళలు మరియు పురుషులు) టోర్నమెంట్ పోస్టర్ మరియు బ్రోచర్ ఆవిష్కరణ…*_
కాకుటూరు, నెల్లూరు జిల్లా:
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఈ నెల 30వ తేదీ నుండి మే 8వ తేదీ వరకు జరగనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ సందర్భంగా మంగళవారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు భవనంలోపోస్టర్ మరియు బ్రోచర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ:
“దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల నుండి 93 మహిళల జట్లు ఈ నెల 30వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు టోర్నమెంట్‌లో పాల్గొంటాయి. అనంతరం మే 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు 95 పురుషుల జట్లు పోటీపడతాయి” అని తెలిపారు.
విశ్వవిద్యాలయం క్రీడా విభాగం ఆధ్వర్యంలో ఈ పోటీలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్టర్ డాక్టర్ కే.సునీత కళాశాల ప్రిన్సిపల్ ఇంచార్జ్ డాక్టర్ ఎం.హనుమారెడ్డి,స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ సిహెచ్.వెంకట్రాయులు, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఆర్. మధుమతి,డీన్ సి డి సి డాక్టర్ ఎం హుస్సేనయ్య , ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం, సహాయక రిజిస్టర్ సుజయ్ కుమార్, స్పోర్ట్స్ బోర్డ్ సిబ్బంది ఏ.అజయ్ పిడి ప్రవీణ్ కుమార్, డాక్టర్ కృష్ణారెడ్డి, డాక్టర్ సుబ్రహ్మణ్యం నాయుడు, డాక్టర్ లక్ష్మీప్రసన్న, మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.