_*”వి.ఎస్.యూ ఉద్యోగి శిఖరం ద్వారక కి ఘన నివాళి..”*_
……………………
కాకుటూరు: విక్రమ సింహపురి యూనివర్శిటీ లో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న శిఖరం ద్వారక గారు హఠాత్తుగా మరణించారు.
ఈ శోకసమయంలో, విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని శ్రీ సి.వి.రామన్ సెమినార్ హాల్ నందు ద్వారక గారి చిత్రపటానికి వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్. విజయ భాస్కర రావు గారు, మరియు రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత గారు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా, వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్. విజయ భాస్కర రావు గారు, “ద్వారక గారు తమ విధుల్లో అంకితభావంతో పనిచేసి, ఆయన కృషి, సేవలను ఎప్పటికీ మర్చిపోలేము” అని పేర్కొన్నారు.
రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత గారు, “ఆయన యొక్క సానుకూల ప్రవర్తన, కృషి విశ్వవిద్యాలయంలో అందరికీ ప్రేరణగా నిలిచింది. ఆయన కుటుంబానికి మా సానుభూతి” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. విజయ, విశ్వవిద్యాలయ కావలి కళాశాల టి.వీరారెడ్డి, డా” సాయి ప్రసాద్ రెడ్డి డిప్యుటీ రిజిస్ట్రార్ , డా” సుజయ్ కుమార్ సహాయక రిజిస్ట్రార్, జి రామ కృష్ణ సుపర్నేంట్,మరియు అద్యాపకులు సిబ్బంది ఘన నివాళులు అర్పించారు.