_*యోగి వేమన విశ్వవిద్యాలయానికి ఇన్‌చార్జ్ వైస్-చాన్స్‌లర్‌గా ఆచార్య అల్లం శ్రీనివాసరావు*_

కడప జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయానికి ఇన్‌చార్జ్ వైస్-చాన్స్‌లర్‌గా ఆచార్య అల్లం శ్రీనివాసరావును నియమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ వైస్-చాన్స్‌లర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను, యోగి వేమన విశ్వవిద్యాలయానికి ఇన్‌చార్జ్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ ఉత్తర్వులు గవర్నర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ చేతులు మీదుగా విడుదలయ్యాయి. కొత్త నియామకం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అమలులో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *