_*నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ (ఎన్ పి ఎల్) ఢిల్లీ తో భాగస్వామ్య ఒప్పంద దిశగా చర్చలు వి ఎస్ యు వైస్ ఛాన్స్లర్…*_
…. ………….
CSIR-నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ (NPL), ఢిల్లీ డైరెక్టర్ డా. వేణుగోపాల్ అచంట గారిని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ (VSU) ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు గారు కలవడం జరిగింది.
ఈ సందర్భంగా ఆచార్య అల్లం శ్రీనివాసరావు గారు డా. వేణుగోపాల్ అచంట గారితో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో నూతన పరిశోధనా అవకాశాలు, పరస్పర సహకారం, విద్యార్థుల శిక్షణ, మరియు రెండు సంస్థల మధ్య సహకార ఒప్పందం (MOU) వంటి అంశాలపై విశదంగా చర్చించారు.
అంతేకాక, భారతదేశంలోని ప్రముఖ పరిశోధనా సంస్థల్లో ఒకటైన NPL డైరెక్టర్ డా. వేణుగోపాల్ అచంట గారిని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాన్ని సందర్శించాలని ఆహ్వానించారు. త్వరలోనే ఢిల్లీలోని NPLతో విశ్వవిద్యాలయం పరస్పర సహకార ఒప్పందం (MOU) కుదుర్చుకోనుంది.
ఈ చర్చల్లో విశ్వవిద్యాలయ విద్యార్థులకు పరిశోధనా అవకాశాలను విస్తరించడం, నూతన శాస్త్రీయ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, మరియు ఆధునిక ప్రయోగశాల సౌకర్యాలను వినియోగించే అవకాశాల గురించి ప్రాముఖ్యతనిచ్చారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉన్న NPL, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంతో కూడా శాస్త్రీయ, సాంకేతిక పరంగా సహకారం కొనసాగించేందుకు సానుకూలంగా స్పందించింది.
భవిష్యత్తులో ఉభయ సంస్థల మధ్య సంయుక్త పరిశోధనా ప్రాజెక్టులు, సాంకేతిక మార్పిడి, మరియు విద్యార్థులకు శాస్త్రీయ శిక్షణకై ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టే అవకాశముంది.
ఈ భాగస్వామ్యం ద్వారా విశ్వవిద్యాలయ పరిశోధకులు మరియు విద్యార్థులు NPLలో ప్రాముఖ్యత కలిగిన పరిశోధనల్లో పాల్గొనే అవకాశం పొందనున్నారు. MOU కుదిరిన వెంటనే, పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మరింత కార్యాచరణ చేపట్టాలని ఇరు సంస్థల ప్రతినిధులు ఆకాంక్షించారు.