_*నాణ్యమైన విద్యే లక్ష్యం: వి.ఎస్.యు వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్. విజయభాస్కరరావు….*_
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సి.డి.సి డీన్ ఆధ్వర్యంలో అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్.విజయభాస్కరరావు గారు, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆచార్య ఎస్. విజయభాస్కరరావు గారు మాట్లాడుతూ, నాణ్యమైన విద్య అందించడంలో ఎటువంటి రాజీ పడేది లేదని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే మన లక్ష్యమని పేర్కొన్నారు.
విద్యార్థుల శ్రేయస్సు కోసం అనుబంధ కళాశాలలు విద్యా ప్రమాణాలు పాటించాలని, పరిశోధనాత్మక శైలిలో విద్యాబోధన జరుగాలని సూచించారు. అలాగే, ప్రతీ కళాశాల తమ విధులను నిబద్ధతతోను, విద్యార్థుల సామర్ధ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
కళాశాలల పనితీరును పరిశీలించడానికి మరియు మెరుగుపరచడానికి విశ్వవిద్యాలయం తరచూ పర్యవేక్షణ చేపడుతుందని తెలిపారు.
అలాగే రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత గారు మాట్లాడుతూ, అనుబంధ కళాశాలలు విశ్వవిద్యాలయ మార్గదర్శకాలకు అనుగుణంగా తమ విధులను నిర్వహించాలనీ, విద్యా ప్రమాణాలను కాపాడటంలో ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు.
ప్రధానంగా అకడమిక్ విద్యాబోధనలో నూతన విధానాలను అందిపుచ్చుకుని, విద్యార్థులకు ఉత్తమమైన శిక్షణ అందించాలన్నది.
పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అభ్యాసం, విద్యార్థులను పరిశ్రమ అవసరాలకు సిద్ధం చేసే శిక్షణా కార్యక్రమాలను అమలు చేయాలని సూచించారు.
పరీక్షల నిర్వహణలో పారదర్శకత పాటించి, ఫలితాల ప్రక్రియలో పారదర్శకత పాటించి వేగంగా పూర్తిచేయడం ముఖ్యమని వివరించారు.
ఎస్ ఎస్ ఎస్ సంబందిత ప్రోగ్రామ్స్ అర్ధవంతంగా సమాజశ్రేయస్సు కోసం నిర్దిష్ట సమయంలో చేపట్టి సంబందిత సమాచారాన్ని అధికారులకు అందజేయలని తెలిపారు.
తదుపరి డీన్ సీ.డి.సి డాక్టర్ ఎం. హుస్సేనయ్య గారు మాట్లాడుతూ, అనుబంధ కళాశాలల ప్రామాణికతను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని, విశ్వవిద్యాలయానికి అనుసంధానమైన ప్రతి కళాశాల విద్యార్థులకు ఉత్తమ సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు.
విశ్వవిద్యాలయం మరియు అనుబంధ కళాశాలలు సమన్వయంతో పని చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో అనుబంధ కళాశాలల ప్రతినిధులతో సమాలోచనలు జరిపి, విశ్లేషించి, అభివృద్ధి సాధించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నది సూచించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వవిద్యాలయ పరిక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఆర్ మధుమతి గారు మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ పై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. వారు పరీక్షల నిర్వహణలో పారదర్శకత మరియు సమగ్రతను తప్పనిసరిగా పాటించాలన్నారు.
ఇంటర్నల్ మార్క్స్, విద్యార్థులకు సంబంధించిన వివరాలు మరియు అపార్ ఐ డి యొక్క వివరాలు తోరతశలో పూర్తి చేయాలనీ సూచించారు.
ఈ కార్యక్రమలో విశ్వవిద్యాలయల కళాశాలల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్ విజయ,ఆచార్య టి వీరారెడ్డి మరియు అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్ల పాల్గొనారు.