_*కంచి సాయి భరత్‌కు డాక్టరేట్ …*_
……………………..
నెల్లూరు: కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ మేనేజ్‌మెంట్ ఫ్యాకల్టీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగ పరిశోధన విద్యార్ధి కంచి సాయి భరత్ తన పరిశోధనలో విశేష కృషి చేసి “Prospects and Challenges Faced by the New Entrepreneurs of MSME – A Study with Reference to SPS Nellore District, Andhra Pradesh” అనే అంశంపై అధ్యయనం నిర్వహించి Ph.D. పట్టా సాధించారు. పలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ లో ఈ అంశంపై పరిశోధన పత్రాలు ప్రచురించారు. ఆయన ఈ పరిశోధనను డాక్టర్ పి. చెంచు రెడ్డి గారి పర్యవేక్షణలో విజయవంతంగా పూర్తిచేశారు.
ఈ సందర్భంగా, సోమవారం విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలో జరిగిన కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయ భాస్కర రావు గారి చేతుల మీదుగా శ్రీ కంచి సాయి భరత్‌కు డాక్టరేట్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత,కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్ విజయ,పరిక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సిహెచ్ వెంకటరయులు ,అధ్యాపకులు, మరియు పరిశోదనా విద్యార్ధులు, శుభాకాంక్షలు తెలిపారు.