***_అన్నదాతలు ఆనందంగా ఉంటే కాకాణికి ఎందుకంతా కడుపుమంట.._***

***_మాజీ మంత్రి కాకాణి పై ఫైర్ అయిన టిడిపి యూత్ నాయకులు_***

సర్వేపల్లి నియోజకవర్గంలో అన్నదాతలు ఆనందంగా ఉంటే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎందుకంతా కడుపుమంటని పొదలకూరు తెలుగుదేశంపార్టీ యూత్ నాయకులు ప్రశ్నించారు. పట్టణంలోని ఆర్అండ్ బి అతిధి గృహాంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి టిఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షుడు కలగట్ల సందీప్, సర్వేపల్లి టిడిపి తెలుగు యువత ఉపాధ్యక్షుడు ఆదాల మురళీరెడ్డి టిడిపి యూత్ నాయకుడు అట్లూరి అనీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అవినీతికి కేరాఫ్ మారిందని‌ ప్రజలు ఆ విషయం గ్రహించి కూటమి ప్రభుత్వానికి పట్టంకట్టారన్నారు.ప్రభుత్వం వచ్చి ఆరునెలలే గడుస్తున్న అభివృద్ధి ప్రధంలో దూసుకుపోతుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు.అన్నదాతలు ఆనంగా ఉంటే మాజీ మంత్రి కాకాణికి ఎందుకంతా కడుపుమంటని ప్రశ్నించారు. నిద్రలేచింది మొదలు కరోనా ప్యాలెస్ లో కూర్చోని సోషల్ మీడియాలో అవాస్తవాలు పోస్టులు పెట్టి శునకానందం పొందుతున్నారని తెలిపారు. రైతుల ఆనందాన్ని మాజీ మంత్రి కాకాణి ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు.రూ.6 కోట్లతో ఇరిగేషన్ కాలువల మరమ్మతులు జరిగితే రూ.20 కోట్ల అవినీతి అని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు.నిత్యం కా..కా..కా..కా అంటూ కాకిలా అరవడమే కాకాణి పనిగా పెట్టుకున్నాడని దుయ్యబట్టారు.కనుపూరు కాలువలో పడవలతో పూడికతీసి ఉమ్మడి ఏపీలోనే కొత్త చరిత్ర సృష్టించిన వ్యక్తి ఒక్క కాకాణి గోవర్ధన్ రెడ్డి మాత్రనే అని అన్నారు. పొదలకూరు మండలాన్ని సోమశిల దక్షిణ కాలువ,కండలేరు ఎడమకాలువ లిఫ్ట్ తో సస్యశామలం చేసిన ఘనత సోమిరెడ్డికే దక్కుతుందని‌ అన్నారు.సర్వేపల్లి నియోజక వర్గంలో ప్రతి ఎకరాలో పంటలు పండించాలని ఆయన కంకణం కట్టుకున్నారని ఎవరు ఎన్నిఅడ్డంకులు సృష్టించిన వారి కాదన్నారు.కాకాణి మీ సొంత మండలమైన పొదలకూరులో చెప్పుకోదగ్గ ఏమైన పనులు చేశారా అదే మా మా నాయకుడి బ్రాండ్ చెప్పాలంటే సామాజిక ఆరోగ్య కేంద్రం,మెగా వాటర్ ప్లాంట్, ఎత్తిపోతల పథకం,నిమ్మ మార్కెట్ యార్డు అభివృద్ది, దక్షిణ కాలువకు అటవీ అనుమతులు తెచ్చిన ఘనత మా నాయకుడు సోమిరెడ్డికే దక్కుతుంది.మా నాయకుడు ప్రతి క్షణం రైతుల శ్రేయస్సును కోరుకుంటూ వారికి ఉపయోగపడే పనులు చేయిస్తున్నారే తప్పా ఏనాడు అవినీతి సొమ్ముకు ఆశపడలేదన్నారు.నోటికొచ్చినట్టు మాట్లాడటం గాక విలువలతో కూడిన రాజకీయం చేయాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణికి వైసీపీ నేతలకు హితవు పలికారు.ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు షేక్.జహీర్ విజయ్ రెడ్డి, రాజామోహన్, మధు, బాబులు, ప్రసాద్. మోహిత్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed