
_*వి ఎస్ యూ “ప్రకృతిని కాపాడుదాం – మైపాడు బీచ్‌లో శుభ్రతా కార్యక్రమం”*_
……………………..
స్వచ్ఛ భారత్ పథకం మరియు కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో కోస్టల్ క్లీన్-అప్ డే 2025 కార్యక్రమంలో భాగంగా మైపాడు బీచ్‌లో తీర పరిశుభ్రతా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT), విక్రమ సింహపురి యూనివర్సిటీ (VSU) సంయుక్తంగా నిర్వహించాయి.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత మాట్లాడుతూ, తీర ప్రాంతాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణలో కీలకమని, విద్యార్థులు ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనడం సమాజానికి ఆదర్శమని అభినందించారు.
NIOT సైంటిస్ట్ డాక్టర్ జి. దేవిరామ్ మాట్లాడుతూ, తీర ప్రాంతాల శుభ్రత సముద్ర జీవవ్యవస్థ రక్షణకు, ప్రజల ఆరోగ్యానికి అత్యంత అవసరమని, ఇలాంటి కార్యక్రమాలు తీరప్రాంత ప్రజల్లో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.
NIOT సైంటిస్ట్ డాక్టర్ సచ్చితనందన్ మాట్లాడుతూ, తీర ప్రాంతాలను శుభ్రంగా ఉంచడం ద్వారా పర్యాటక అభివృద్ధికి దోహదం చేస్తుందని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు.
విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ మరియు స్టేట్ లెవెల్ ఎక్స్పర్ట్ అప్రైసల్ కమిటీ సభ్యురాలు (MOFECC) ఆచార్య సి.హెచ్. విజయ మాట్లాడుతూ, తీరప్రాంత పరిశుభ్రత సమాజ అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని, విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలలో ముందుండి పాల్గొనడం విశేషమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సముద్ర జీవశాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ ఎం.హనుమారెడ్డి, డాక్టర్ సిహెచ్. వెంకట్రాయిలు, డాక్టర్ జి సుజయ్ కుమార్,డాక్టర్ నాగరాజు,డాక్టర్ ఎస్ బి సాయినాథ్ యన్ ఎస్ ఎస్ యూనిట్ -2 ప్రోగ్రాం ఆఫీసర్, NIOT బృంద సభ్యులు డాక్టర్ చిరంజీవి, జోయెల్, డాక్టర్ నందిని విశ్వవిద్యాలయ విద్యార్థులు, అధ్యాపకులు, NSS వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొని బీచ్‌లోని చెత్తను తొలగించారు. తీర ప్రాంత పరిశుభ్రతతో పాటు శుభ్రమైన, ఆరోగ్యకరమైన తీరమును కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ప్రజలకు అవగాహన కల్పించారు,స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు.
అంతర్జాతీయ కోస్టల్ క్లీనప్ డే 2025 సందర్భంలో ఈ కార్యక్రమం నిర్వహించబడగా, సముద్ర పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన జీవన విధానాల ప్రాధాన్యతను ఈ సందర్భంగా ప్రదర్శించారు.