
_*విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ అభివృద్ధికి యూనియన్ బ్యాంక్ మద్దతు…*_
………………
నెల్లూరు: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు గారిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ శ్రీ ఏ. రాజశేఖరం గారు మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అభివృద్ధికి బ్యాంక్ తరఫున సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు శ్రీ రాజశేఖరం గారు ప్రకటించారు. ప్రత్యేకంగా, త్వరలో విశ్వవిద్యాలయానికి ఎలక్ట్రిక్ కార్లు అందించనున్నట్లు తెలిపారు.
అలాగే, విద్యార్థుల కోసం బ్యాంకింగ్ సేవలు, విద్యా రుణాలు, ఇతర ఆర్థిక సహాయాలపై విస్తృతంగా చర్చించబడింది.
విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఇదొక మంచి అవకాశమని ఆచార్య అల్లం శ్రీనివాసరావు గారు అభిప్రాయపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరిచే భాగస్వామ్యాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో విశ్వవిద్యాలయ రిజిస్టర్ డాక్టర్ కె. సునీత, డిప్యూటీ రిజిస్టర్ డాక్టర్ సి ఎస్ సాయి ప్రసాద్ రెడ్డి, సహయక రిజిస్ట్రార్ డాక్టర్ జి సుజయ్ కుమార్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బివి నగర్ బ్రాంచ్ మేనేజర్ రామ్మోహన్, విశ్వవిద్యాలయ అధికారులు, బ్యాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు.