*విద్యతోనే అభివృద్ధి సాధ్యం*
*విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడం ద్వారా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం*
*ప్రతి గిరిజన బిడ్డ బడిలో ఉండేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి*
*వెంకటాచలం మండలం గొలగమూడిలోని ఇండియన్ టూరిజం ఇనిస్టిట్యూట్ లో ఉపాధ్యాయుల శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*సోమిరెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికిన ఉపాధ్యాయులు*
*శిక్షణలో భాగంగా ప్రతిభ చూపిన ఉపాధ్యాయులకు ప్రశంస పత్రాలు, జ్ఞాపికలు అందజేసిన సోమిరెడ్డి*
ఒకటి, రెండు తరగతుల నుంచే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడం ద్వారా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దవచ్చు
విద్యతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుంది
శిక్షణలో భాగంగా గ్రహించిన అంశాల ద్వారా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుతారని ఆకాంక్షిస్తున్నా
ఏ ఊరికి వెళ్లినా గిరిజన బిడ్డలు బడికి దూరంగా ఉంటున్నారు..ఆ పిల్లలందరినీ బడికి తీసుకొచ్చే బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలని కోరుతున్నాను