*ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ దేశంలోనే ఒక చరిత్ర*
*పింఛన్ల కోసం ఏడాదికి రూ.30 వేల కోట్లు నిధులు*
*వెంకటాచలం ఇందిరమ్మ కాలనీ, కనుపూరు, ఇస్లాంపేటలో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
నూతన సంవత్సరం సందర్భంగా ఒక రోజు ముందే లబ్ధిదారులకు పింఛన్లు అందజేశాం
వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి రూ.15 వేలు పింఛన్ గా పంపిణీ చేయడం దేశంలోనే ఒక చరిత్ర
సామాజిక పింఛన్ల పంపిణీ కోసం రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం ఏటా రూ.30 వేల కోట్లు ఖర్చుపెడుతోంది
దేశంలోనే మొదట రూ.30తో సామాజిక పింఛన్ పథకాన్ని ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్
పింఛన్ ను రూ.200 నుంచి రూ.2 వేలకు, రూ.3 వేలు నుంచి రూ.4 వేలకు పెంచింది చంద్రబాబు నాయుడు
ఈ రోజు అందుతున్న రూ.4 వేలు పింఛన్ లో రూ.2800 పెంచిన ఘనత చంద్రబాబు నాయుడిదే
రూ.2 వేలు నుంచి రూ.3 వేలకు పెంచేందుకు వైసీపీ ప్రభుత్వంలో జగనన్నకు నాలుగేళ్లు పట్టింది
టీడీపీ –జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకటో తేదీన ప్రతి పేద కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటోంది.
రూ.4 వేలు పింఛన్ ఇచ్చి పేదలకు పెద్ద ఊరటను ఇస్తున్న చంద్రబాబు నాయుడికి లబ్ధిదారులందరి తరఫున ధన్యవాదములు తెలియజేస్తున్నాను.