*సంక్షేమానికి చిరునామా చంద్రబాబు పాలన*
– ఒకరోజు ముందుగా పెన్షన్ల పంపిణి చేయడం గతంలో జరిగిందా..కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
– సంక్షేమం అభివృద్ధి సమపాళ్ళలో చేయగల సమర్ధత చంద్రబాబుకే వుంది.
– సహకరిస్తున్న టిడిపి,బిజెపి,జనసేన నాయకులకు కృతజ్ఞ్యతలు.
– కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్టం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. ఇందుకూరుపేట మండలం పున్నూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణి కార్యక్రమానికి విచ్చేసిన ఆమెకు స్థానిక టిడిపి నాయకులు ఘనస్వాగతం పలికారు. పున్నూరు గ్రామంలో సచివాలయ సిబ్బందితో కలిసి ఆమె ఇంటింటికి తిరిగి పెన్షన్లు అందచేశారు. ఆప్యాయంగా పలకరిస్తూ యోగ క్షేమాలు విచారించారు. గ్రామంలోని వివిధ సమస్యలపై స్థానికులు యిచ్చిన వినతి పత్రాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు స్థానిక సమస్యలపై స్పందించారు. మాట్లాడుతూ పున్నూరు గ్రామంలో పంట పొలాలకు వెళ్లే డొంక దారిని బాగు చేస్తానని హామీ యిచ్చారు. పున్నూరు ముదివర్తి పాళెం రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి అయ్యేలా అధికారులకు ఆదేశిస్తానన్నారు. చెరువు పూడిక తీసుకునేందుకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రొక్లైన్ అందిస్తామన్నారు. శిథిలావస్థకు చేరిన గిరిజన కాలనీ పునర్నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. స్మశాన మరమత్తులకు సంబంధించి పున్నూరు మూలపాళెం వాసులకు లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట ఎంపిడిఓ నాగేంద్రబాబు, ఇందుకూరుపేట మండల అధ్యక్షులు వీరేంద్ర నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, చెంచు కిషోర్ యాదవ్, కోడూరు కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.