*కొండ్రెడ్డిని సత్కరించిన జిల్లా వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు*
*నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డిగారిని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులుగా నియమితులైన ముంగమూరు ఆశ్రీత్ రెడ్డి కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఆదాల ప్రభాకర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. నూతన జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులుగా నియమితులైన ముంగమూరు ఆశ్రిత్ రెడ్డిని కొండ్రెడ్డి రంగారెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ ఎంఎస్ఎమ్ఈ మాజీ డైరెక్టర్ పాశం శ్రీనివాస్, విద్యార్థి విభాగం నాయకులు లిఖిత్ , సిద్ధార్థ ,హర్ష తదితరులు ఉన్నారు.*