*భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇకలేరు*
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నూమూశారు.
శ్వాసకోశ సంబంధిత, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆగస్ట్ 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్సం పొందుతున్నారు. వెంటిలేటర్‌పై ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. చివరికి ఆయన పరిస్థితి విషమించడంతో సెప్టెంబర్ 12 గురువారం తుది శ్వాస విడిచారు.
తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సీతారాం ఏచూరి ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆయన 25 రోజులుగా చికిత్స పొందుతున్నారు.
72 ఏళ్ల ఏచూరి సీపీఎం నేతకు ఇటీవల క్యాటరాక్ట్ ఆపరేషన్ కూడా జరిగింది. డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డాక్టర్ గౌరి నేతృత్వంలో వైద్య బృందం ఆయనకు చికిత్స అందించింది.
అయితే ఇన్ఫెక్షన్ తొలగించేందుకు ఉపయోగించిన మందులు పనిచేయకపోవడంతో జపాన్ నుంచి ప్రత్యేక మందులు కూడా తెప్పించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు.
దీంతో కమ్యూనిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు. అతను హైదరాబాద్‌లో పెరిగాడు. పదో తరగతి వరకు ఆల్ సెయింట్స్ హైస్కూల్లో చదివారు. 12వ పరీక్షలో దేశంలోనే ప్రథమ ర్యాంక్ సాధించారు.
1969 తెలంగాణ ఉద్యమం సమయంలో ఢిల్లీ చేరుకున్నారు. ఏచూరి ఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ వన్ సాధించారు.
అతను ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో మొదటి ర్యాంక్‌తో ఎకనామిక్స్‌లో తన బిఎ (ఆనర్స్) పూర్తి చేశారు. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఏ చేశారు. పీహెచ్డీ కోసం జేఎన్‌యూలో అడ్మిషన్ తీసుకున్నారు.
అయితే 1975లో ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయినందున పూర్తి చేయలేకపోయారు.
1974లో భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ)లో చేరిన ఏచూరి ఒక సంవత్సరం తరువాత అతను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) లో చేరారు. 1975లో సిపిఎంలో చేరారు. వరుసగా మూడుసార్లు జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఎమర్జెన్సీ తర్వాత, అతను ఒక సంవత్సరంలో (1977-78) మూడుసార్లు JNU స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కేరళ, బెంగాల్ నుండి కాకుండా SFI జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికైన మొదటి వ్యక్తిగా నిలిచారు.
ఏచూరి 1984లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. 1986లో ఎస్ఎఫ్ఐ నుంచి వైదొలిగారు. ఆ తర్వాత 1992లో జరిగిన పద్నాలుగో జాతీయ సమావేశాల్లో పొలిట్‌బ్యూరోకు ఎన్నికయ్యారు.
ఏచూరి జూలై 2005లో పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 19 ఏప్రిల్ 2015న సీపీఐ(ఎం) ఐదవ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
ఏప్రిల్ 2018లో మళ్లీ సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఏప్రిల్ 2022లో, ఏచూరి మూడోసారి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
ఏచూరి భార్య సీమా చిస్తీ వృత్తిరీత్యా జర్నలిస్టు. తన భార్య తనకు ఆర్థికంగా సహకరిస్తుందని ఏచూరి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అతని మొదటి వివాహం వీణా మజుందార్ కుమార్తె ఇంద్రాణి మజుందార్‌తో జరిగింది.
ఈ వివాహంలో అతనికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఏచూరి కుమారుడు ఆశిష్ ఏప్రిల్ 22, 2021న 34 ఏళ్ల వయసులో COVID-19 కారణంగా మరణించారు
- సీతారాం- జీవితం- ముఖ్యఘట్టాలు.,,
1952 ఆగష్టు 12న చెన్నైలో తెలుగు కుటుంబంలో జన్మించిన ఏచూరి.. బాల్యం మొత్తం హైదరాబాద్‌లో గడిపారు. హైదరాబాద్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. తండ్రి సర్వేశ్వర సోమయాజి ఏపీఎస్ ఆర్టీసీలో ఇంజినీర్ ఉద్యోగం, తల్లి కల్పకం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంతో ఢిల్లీకి చేరిన ఏచూరి.. ఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో 12వ తరగతి పూర్తి చేశారు.
ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బీఏ ఆనర్స్ చేశారు. జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎమ్ఏ ఎకనామిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో(ఎస్ఎఫ్ఐ) చేరారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ కావడంతో చదవుకు ఫుల్‌స్టాఫ్ పెట్టారు.
1975లో సీపీఎం ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న ఏచూరి
ఎమర్జెన్సీ సమయంలో అండర్ గ్రౌండ్‌కు వెళ్లిన సీతారాం
ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత మూడుసార్లు జేఎన్య నాయకుడిగా ఎన్నిక
ఉమ్మడి ఏపీ సీఎస్ మోహన్ కందాకు ఏచూరి మేనల్లుడు
1984లో సీపీఎం కేంద్ర కమిటీలోకి వెళ్లిన ఏచూరి
1985లో పార్టీ రాజ్యాంగ సవరణలో కీలక పాత్రం
ఇంద్రాణి మజుందార్‌తో ఏచూరికి వివాహం
కూతురు అఖిలా ఏచూరి, కొడుకు ఆశిష్ ఏచూరి
జర్నలిస్టు సీమా చిశ్తీని రెండో వివాహం చేసుకున్న ఏచూరి
1992లో జరిగిన 14వ కాంగ్రెస్‌లో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ప్రమోషన్
1996 యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కీలకపాత్ర
2005 నుంచి 2017 వరకు పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ ఎంపీగా ప్రాతినిథ్యం
రచయితగా హిందూస్థాన్ టైమ్స్‌లో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కాలమ్
20 ఏళ్లుగా పార్టీ పత్రిక పీపుల్స్ డెమోక్రసీ ఎడిటోరియల్ బోర్డు మెంబర్
2004లో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణంలోనూ ముఖ్య పాత్ర
2005 నుంచి 2015 వరకు వరుసగా మూడుసార్లు ప్రధాన కార్యదర్శి
2015, 2018, 2022లో సీపీఎం జనరల్ సెక్రటరీగా ఎన్నిక
‘క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే’, ‘సోషలిజం ఇన్ ఛేంజింగ్ వరల్డ్’, ‘మోదీ గవర్నమెంట్: న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం’, ‘కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం’ వంటి పుస్తకాలు రాశారు.
అనారోగ్యంతో ఆగష్టు 19న ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఏచూరి
చికిత్స పొందుతూ సెప్టెంబర్ 12న కన్నుమూత