*ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్బంగా రక్త దాతలను సత్కరించిన .. రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*

===================
నెల్లూరు రెడ్ క్రాస్ జిల్లా కార్యాలయంలో రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ రక్త దాతల దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రక్తదాన ఆవశ్యకతను పలువురు దాతలు వివరించారు. అనంతరం అత్యధిక సార్లు రక్తం ఇచ్చిన 59 మంది దాతలను గుర్తించి రెడ్ క్రాస్ చైర్మన్ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పలువురు మేనేజింగ్ కమిటీ సభ్యులు.. మోమెంటో సర్టిఫికెట్లు అందజేసి సత్కరించారు.

ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..

▪️ *ప్రతి ఏటా జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం.*

▪️ *ప్రపంచ రక్త దాతల దినోత్సవం పురస్కరించుకొని నెల్లూరు రెడ్ క్రాస్ లో అత్యధికం గా రక్తం ఇచ్చిన 59 మంది దాతలకు సర్టిఫికెట్లు మొమెంటో అందజేయడం జరిగింది.*

▪️ *ప్రతి ఒక్కరూ రక్తం ఇచ్చేందుకు ముందుకు రావాలని.. రక్తదానం వలన దాతలు మరింత ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.*

▪️ *సంవత్సరానికి 15 వేల యూనిట్ల రక్తాన్ని సేకరిస్తూ నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ రాష్ట్రం లోనే మొదటి స్థానంలో ఉంది*

▪️ *నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు ను ఆధునికరించి.. అన్ని వసతులతో బ్లడ్ బ్యాంకు ను అందుబాటులోకి తీసుకొచ్చాం.*

▪️ *త్వరలో నెల్లూరు రెడ్ క్రాస్ లో 20 పడగల తల సేమియా క్లినిక్ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు .*

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ దామిశెట్టి సుధీర్ నాయుడు, ఎం సి మెంబర్లు నేతాజీ సుబ్బారెడ్డి,మలిరెడ్డి కోటారెడ్డి, గంధం ప్రసన్నాంజనేయులు, రవి ప్రకాష్, సురేష్ కుమార్ జైన్, కలికి శ్రీహరి రెడ్డి, దాసరి రాజేంద్రప్రసాద్, రంగయ్య నాయుడు, గుణపాటి ప్రసాద్, వాకాటి విజయ్ కుమార్ రెడ్డి, బ్లడ్ బ్యాంక్ కన్వీనర్ అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed