*ఎస్ ఎల్ వీ స్టోన్ క్రషర్స్ కి రంగు పడింది*

*వైసిపి నేత వైవీ రామిరెడ్డికి షాక్*

*.. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేపట్టారని ఫిర్యాదులు*

*.. వైవిరామిరెడ్డి కంపెనీకి 75 కోట్ల జరిమానా విధించిన మైన్స్ అండ్ జియాలజీ అధికారులు*

*.. ఎస్ ఎల్ వి స్టోన్ క్రషర్స్ కు షోకాజ్ నోటీసులు*

*. అటవీ భూముల్లో కూడా మైనింగ్ చేపట్టారని మరో ఫిర్యాదు*

*నెల్లూరు జిల్లాలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికార పార్టీ నేతలు ఎలా దోచుకున్నారో… ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు తమకు ఎదురేలేదని తమకు ఎదురు ఎవరు వస్తారా రండి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నెల్లూరు జిల్లాలో సహజ వనరులను యదేచ్చగా కొల్లగొట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వైసిపి నేతలకు మైండ్ తిరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.*

*అదే కోవలో నెల్లూరు జిల్లాలోని రాపూర్ సమీపంలో ప్రముఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైవి రామిరెడ్డి ఎస్ఎల్ వీ స్టోన్ క్రషర్స్ ను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులకు విరుద్ధంగా, నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎస్ఎల్వీ స్టోన్ క్రషర్స్ అనేక అక్రమాలకు పాల్పడినట్టు పలువురు ఫిర్యాదు చేశారు సుమారు పది లక్షల టన్నుల బ్లూ మెటల్ ను అక్రమంగా మైనింగ్ చేపట్టినట్లు మైన్స్ అండ్ జియాలజీ అధికారులకు ఫిర్యాదు రావడంతో వారు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎస్ఎల్ వీ స్టోన్ క్రషర్స్ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. సుమారు 75 కోట్ల జరిమానాను విధిస్తూ వెంటనే చెల్లించాలని షోకాజ్ నోటీసులు జారీ చేసారు. షోకాజ్ నోటీసుల జారీతో ఎస్ఎల్వి స్టోన్ క్రషర్స్ నిర్వహించే నిర్వాహకులు బెంబేలెత్తారు. నిన్నటి వరకు అధికారంలో ఉండడంతో ఒక్క అధికారికి కూడా నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరుగుతున్న ఈ ప్రాంతానికి రాలేదు. కానీ అధికారం పోవడంతో పరిస్థితి తలకిందులైంది.*

*దీనితోపాటు అదనంగా అటవీ శాఖ భూముల్లో కూడా అక్రమ మైనింగ్ చేపట్టారని మైన్స్ అండ్ జియాలజీ అధికారులకు వీరిపై ఫిర్యాదు చేశారు. దీనిని కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వైసిపి సీనియర్ నేత ఆదాలకు అన్ని తానై ఎన్నికలు నిర్వహించిన వైవి రామిరెడ్డికి భారీ జరినామాతో పాటు మైన్స్ అండ్ జియాలజీ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలిన నేతలు వణికి పోతున్నారు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed