*అక్షర యోధుడు, మీడియా దిగ్గజం, పద్మవిభూషణ్ శ్రీ రామోజీరావు గారి మృతి చాలా బాధాకరం*
*వెంకటాచలం మండల టీడీపీ అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్*
*సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సూచనల మేరకు మండల టీడీపీ ఆధ్వర్యంలో శనివారం శ్రీ రామోజీరావు గారి మృతిపై సంతాపం*
భారతీయ మీడియా రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన దార్శనికుడు రామోజీరావు గారు
మీడియా, వినోద ప్రపంచంలో ఆయన చెరగని ముద్ర వేశారు
నలుగురు నడిచిన బాట కాదు.. కొత్తదారులు సృష్టించడం ఆయన నైజం
లక్ష్యసాధనకు దశాబ్దలపాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు, రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు
తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావంతమైన ముద్రవేసిన శ్రీ రామోజీరావు తెలుగు ప్రజల ఆస్తి
ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు.. దేశానికి కూడా తీరని లోటు
మీడియా రంగంలో ఆయనొక శిఖరం, ఆయన ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం
రామోజీరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం