- *విక్రమ సింహపురి యూనివర్సిటీలో రాత్రికి రాత్రే వెలసిన శిలాఫలకాలు*
- *విక్రమ సింహపురి విశ్వవిద్యాలయమా.. వైసీపీ శిక్షణ కార్యాలయమా…!*
*వెంకటాచలం మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న భవనాలకు అవి పూర్తి కాకుండానే ప్రారంభోత్సవ శిలాఫలకాలను శుక్రవారం ఉదయం ఏర్పాటు చేస్తుండగా సర్వేపల్లి ఎమ్మెల్యే శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సూచనల మేరకు టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు*
*భవన నిర్మాణాలు పూర్తి కాకుండానే ఎలా ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఏర్పాటు చేస్తారని, అందులో హడావిడిగా రాత్రికి రాత్రే శిలాఫలకాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని, శిలాఫలకాలు ఏర్పాటు చేసేందుకు ఇంత హడావిడి అవసరమా అని యూనివర్సిటీ అధికారులను నిలదీసిన టీడీపీ నేతలు*
*టీడీపీ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన యూనివర్సిటీ అధికారులు*
*గత రెండేళ్ల కిందట నిర్మించిన భవనాలకు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనాలకు హుటాహుటిన ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఏర్పాటు చేసిన యూనివర్సిటీ ఉపకులపతి సుందరవల్లి*
*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులతో యూనివర్సిటీలోని పలు భవన సముదాయాలు*
*యూనివర్సిటీలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనాలకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా 06-05-2024 తేదీ ప్రకారం ప్రారంభించినట్టు శిలాఫలకం ఏర్పాటు చేయడం ఏమిటి*
*ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇది ఎలా సాధ్యం*
*వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డికి అతి దగ్గర బంధువు కావడంతోనే యూనివర్సిటీ ఉపకులపతి సుందరవల్లికి సాధ్యమైందా*
*గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం యూనివర్సిటీలోని పాత, కొత్త నిర్మాణాలకు 6కి పైగా పాత తేదీలతో ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం*
*రాష్ట్ర ప్రభుత్వం మారి కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా యూనివర్సిటీలో మరింత హడావిడిగా ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఏర్పాటు చేయడం ఏమిటి*
*విక్రమ సింహపురి యూనివర్సిటీలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువు యూనివర్సిటీ ఉపకులపతిగా వ్యవహరిస్తున్న సుందరవల్లి చెప్పిందే వేదం.. చేసిందే శాసనమా…?*
*వైసీపీ ఐదేళ్ల పాలనలో యూనివర్సిటీలో లెక్కకు మించినన్ని దోపిడీలు, అవినీతి, అక్రమాలు జరిగాయి*
*కొత్తగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాత్రికి రాత్రే యూనివర్సిటీలో నిబంధనలకు విరుద్ధంగా ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఏర్పాటు చేయించిన యూనివర్సిటీ ఉపకులపతి సుందరవల్లి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం*
*గత వైసీపీ ఐదేళ్ల పాలనలో విక్రమ సింహపురి యూనివర్సిటీలో అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఉపకులపతి సుందరవల్లి*
*యూనివర్సిటీ ఉపకులపతి సుందరవల్లికి తోడు నీడగా ఆమె చేసిన అవినీతి, అక్రమాల్లో యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ పామూరు రామచంద్రారెడ్డి కూడా తన వంతు పాత్ర పోషించారు*
*రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు వెంటనే స్పందించి యూనివర్సిటీ ఉపకులపతి సుందరవల్లి పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం*