
*అణగారిన, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే : ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్*
*భారతదేశంలో సామాజిక సంస్కరణ ఉద్యమానికి బీజం వేసిన తొలి సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిబాపూలే*
*మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలతో నలిగిపోతున్న బడుగు బలహీన వర్గాలలో చైతన్యం నింపిన మహనీయులు జ్యోతిబా పూలే.*
*తన ఉద్యమ గురువుల్లో జ్యోతిబాపూలే ఒకరని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గర్వంగా చెప్పుకున్నారు.*
*- బీద రవిచంద్ర, శాసనమండలి సభ్యులు, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు.*
తరతరాలుగా అణచివేతకు గురవుతున్న అట్టడుగు, బడుగు, బలహీన వర్గాలలో ఆత్మస్థైర్యం నింపేందుకై మహాత్మా పూలే పరితపించారు.
మహిళల ఉద్దరణకై జ్యోతిరావు పూలే నడుం బిగించారు. స్త్రీలపై నాడున్న కట్టుబాట్లను ఉల్లంఘిస్తూ, సతీమణి సావిత్రిబాయి పూలే సహకారంతో ఉద్యమించారు.
సమాజంలో సగభాగం ఉన్న మహిళల అభివృద్ధితోనే సమాజం అభివృద్ధి చెందుతుందని గ్రహించి స్త్రీ విద్యను ప్రోత్సహించిన మహోన్నత వ్యక్తి జ్యోతిబాపూలే.
మూఢాచారాలైన కన్యాశుల్కం, శిశుహత్యలు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పూలే పోరాటాలు చేశారు. వితంతువులకు వివాహాలు జరిపించారు.
దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాల వంటి వాళ్లని పేర్కొన్న మహాత్మా పూలే తమ చివరి శ్వాస వరకు సమాజాన్ని సంస్కరించేందుకే జీవితంను ధారపోశారు.
మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ప్రపంచానికే ఆదర్శం. సామాజిక తత్వవేత్తగా ప్రజలను చైతన్య పరిచి అనాదిగా పాతుకుపోయిన వివక్షలను నిర్మూలించుటకు తన జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప వ్యక్తి పూలే.
సమాజాన్ని సంస్కరించేందుకు తన జీవితాన్ని త్యాగం చేసిన మహాత్మా జ్యోతిబా పూలే నేటి తరానికి ఆదర్శనీయుడు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మనమంతా సమసమాజ స్థాపనకు కృషి చేయాలి.
అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళా విద్యకు, వారి ఉద్ధరణకు విశేష కృషి చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే.
గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలపై ఎన్నడూ లేని విధంగా దాడులు, దాష్టీకాలు జరిగాయి. బీసీలను అణచివేయడమే లక్ష్యంగా రాజకీయ ప్రేరేపిత దాడులు జరిగాయి.
గత ప్రభుత్వ పాలనలో టీడీపీ కి చెందిన సుమారు 300 మంది బీసీ నేతలు హత్యకు గురయ్యారు. వేలాదిమంది పై దాడులతో పాటు తప్పుడు కేసులు నమోదు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లు దశాబ్దాలుగా అనుభవిస్తున్న 34% రిజర్వేషన్లను అడ్డుకుని 16,500 మంది బీసీ లకు రాజకీయ అవకాశాలు రాకుండా దెబ్బతీశారు.
బీసీల కోసం ఖర్చు చేయాల్సిన సుమారు 75 వేల కోట్ల నిధుల్ని దారి మళ్ళించారు. సబ్ ప్లాన్ నిర్వీర్యం చేశారు, కార్పొరేషన్ లకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారు.
జ్యోతిరావు పూలే ఆశయాలను అనుసరిస్తూ, వారు చూపిన బాటలో అడుగులు వేస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ.
పూలే గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సాధ్యంలోని కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోంది.
బీసీ ల సంక్షేమం కోసం 2024-25 బడ్జెట్లో 39 వేల ఏడు కోట్లు, 2025 – 26 బడ్జెట్లో 47450 కోట్లు, 2026- 27 లో 51 వేల కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించింది.
స్థానిక సంస్థల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లను అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపింది కూటమి ప్రభుత్వం.
బీసీ భవన్ నిర్మాణాలకు నిధులు మంజూరుతో పాటు బీసీ రక్షణ చట్టంకు తుది రూపు తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం.
నాయి బ్రాహ్మణులకు 25 వేల గౌరవ వేతనం, సెలూన్ లకు 200 ఉచిత యూనిట్లు, గీత కార్మికులకు వైన్, బార్ షాపుల్లో 10% కేటాయించింది కూటమి ప్రభుత్వం.
మత్స్యకారులకు చేపల వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయంని 10వేల నుంచి 20 వేలకు పెంచడమే కాక భీమా మొత్తాన్ని రెండు లక్షల నుంచి పది లక్షలకు పెంచి, వారికి మేలు చేసేలా జీవో నెంబర్ 217 రద్దు చేసింది కూటమి ప్రభుత్వం.
ఇలా చెప్పుకుంటూ పోతే బీసీల అభ్యున్నతికి, వారి రక్షణకి , ఆర్థిక, రాజకీయ తోడ్పాటుకు, అవకాశాలు కల్పించేందుకు ఎంతో కృషి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం.