*ఆంధ్రజ్యోతి కదనం లో.. Ysrcp నాయకుల కుటుంబ సభ్యుల గురించి, ఇంట్లోని మహిళల గురించి మాట్లాడిన అసభ్య మాటలపై పర్వతరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి ఫైర్..తుటాల వంటి మాటలతో హెచ్చరిక*

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, కుటుంబ మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణన పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ..నెల్లూరు వేదయపాలెం పోలీస్ స్టేషన్లో *వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలతో పాటు* జిల్లా అధ్యక్షులు *కాకాణి గోవర్ధన్ రెడ్డి* ఆనం అరుణమ్మ గార్లతో కలిసి.. *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు.. స్టేషన్ ఇన్స్పెక్టర్ కు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు.*

ఈ సందర్బంగా *రాధాకృష్ణ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు.*

*పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు మాట్లాడుతూ..

• ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తూ.. టిడిపి నేతలు మాట్లాడుతున్న అసత్యాలను ప్రజల్లో తీసుకెళ్తున్నాయన్నారు.

• కేవలం ఈ రెండు పత్రికలు తెలుగుదేశం పార్టీ.. మౌత్ పబ్లిసిటీ పత్రికల్లా తయారయ్యాయని అన్నారు.

• అలాంటి ఆంధ్రజ్యోతి, ABN ఛానల్లో ఇటీవల ప్రసారమైన కథనాలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు.

• వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైన మహిళల పట్ల దారుణాతి దారుణమైన బాషా మాట్లాడి ఏబీఎన్ రాధాకృష్ణ.. నీ జాతి నీచంగా వ్యవహరించారని మండిపడ్డారు.

• వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి పెళ్ళాల్లను.. చెల్లెలుగా తలచి వారికి ఇంకో పెళ్లి చేస్తారని..మాట్లాడిన మాటలను ప్రజలు చీత్కరించుకుంటున్నారని అన్నారు.

• ఈరోజు.. అడ్డు అదుపు లేకుండా దోచుకు తింటున్న.. పచ్చమూకలు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి.. లేకుండా చేస్తే.. తమకు తిరుగు ఉండదన్నట్లుగా భావిస్తున్నారన్న భావన ప్రతి సామాన్యుడి లోను వ్యక్తం అవుతుందన్నారు.

• ఈరోజు సభ్య సమాజం తలదించుకునేలా ఏబీఎన్ రాధాకృష్ణ మాట్లాడితే చంద్రబాబు నాయుడు.. దానిపై స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు.

• చంద్రబాబు నాయుడు తన భార్యని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనని మాటలు కూడా అన్నారని.. వెక్కివెక్కి ఏడ్చిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు.

• లోకేష్ కూడా మాట్లాడితే పదేపదే మా తల్లిని కించపరిచారు.. అని మాట్లాడతారే..ఈరోజు రెండు కోట్ల మంది మహిళలను మీ ఆంధ్రజ్యోతి పత్రిక అవమానించిందే దానికేం మీరు ఏమి సమాధానం చెప్తారని ప్రశ్నించారు.

• అదే మీ కుటుంబ సభ్యుల్ని మాట్లాడితే మీరు ఊరుకుంటారా.. టిడిపి నేతలు సమాధానం చెప్పాలన్నారు.

• తల్లికి,చెల్లికి, పెళ్ళానికి.. తేడా తెలియని నేతలా ఈరోజు మనల్ని పాలించేదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సిగ్గుతో తలదించుకుంటున్నారని అన్నారు.

• మీరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎంత దెబ్బతీయాలన్న.. అది మీ చేత కాదని.. ప్రజా సమస్యలపై.. మా పోరాటం ఆగదని హెచ్చరించారు.

• మా నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన .. స్ఫూర్తితో.. మీలాంటి ఆంధ్రజ్యోతి ఈనాడు లాంటి, అరాచక శక్తులను.. తరిమికొట్టేరోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed