
*నెల్లూరులో బాబు జగజీవన్ రామ్ భవనం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి.*
… *దళిత నాయకులకు సన్మానం : జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల*
నెల్లూరులో బాబు జగజీవన్ రామ్ భవన్ ఏర్పాటుకు సంబంధిత రెవెన్యూ శాఖ ఇంజనీర్లతో కలిసి స్థల సేకరణ, అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని శోభారాణికి అదేశాలు జారీ చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఆదివారం స్థానిక కస్తూరిబా కళాక్షేత్రంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాబు జగజ్జివన్ రావు 118 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన, బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళీలర్పించిన అనంతరం పిల్లలు చేత జిల్లా కలెక్టర్ కేక్ కట్ చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ మహానేత, దేశ సేవకుడని, అంకితభవన్తో పనిచేశారని ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి యువత ఆచరణీయంగా తీసుకోవాలన్నారు. బాబు జగజీవన్ రామ్ దార్సినికత పరిపాలనదక్షిత స్వాగతించ తగినదని ఆయన అన్నారు. అతిపిన్న వయసులోనే వివిధ శాఖలలో పనిచేసే దేశ అభ్యున్నతికి పని చేశారన్నారు. ఉప ప్రధానిగా ప్రతిభ కనపరిచి అమూల్య సేవలు అందించారని అంతేకాకుండా మంత్రిగా కూడా సేవలు అందించారన్నారు. సత్యాగ్రహ ఉద్యమంలో గాంధీతో కలిసి పోరాడరని లాటికి దెబ్బలు తిన్నారని అన్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ,ఇందిరాగాంధీ మొరార్జీ దేశాయ్ ,వారి హయాంలో కీలక పదవులు పోషించారని. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి యువత ముందుకు సాగాలని అభిలాషించారు. విద్యార్థిని విద్యార్థులు ఆరో తరగతి నుండి 12వ తరగతి లోపల లక్ష్యాన్ని నిర్దేశించుకుని తదనగుణంగా కష్టపడి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన తెలిపారు. చదువుతోనే ఉన్నత స్థితి వస్తుందని పేర్కొన్నారు. విద్యార్థిని విద్యార్థులకు లక్ష్యం ముఖ్యమన్నారు. తాను ఐదు సంవత్సరాలు విదేశాలలో ఉద్యోగం చేస్తూ దేశ సేవ చేయాలని దృక్పథంతో సివిల్స్ పరీక్షలకు సన్నద్ధం అయ్యానని ఆయన తెలిపారు.
కేవలం సాంకేతికతను ఉపయోగించుకొని యూట్యూబ్ ద్వారానే శిక్షణను పొందానని నేటి విద్యార్థిని విద్యార్థులు యూట్యూబ్ ద్వారా విజ్ఞాన్నే పెంచుకోవాలి తప్ప దానిని నిరుపయోగంగా ఉపయోగించకూడదన్నారు. ఆన్లైన్ ద్వారా ఈరోజు అన్ని రకాల మెటీరియల్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఒకప్పటి పరిస్థితి ఈరోజు లేదన్నారు. జిల్లాలోని హాస్టల్లో అభివృద్ధికి ఒక ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకునే విధంగా ఎస్ఓపి ఏర్పాటు చేయడం జరిగిందని, తద్వారా ప్రతి హాస్టలను అన్ని వసతులతో ఫైవ్ స్టార్ హాస్టల్స్ లాగా ఏర్పాటు చేయడమే తన లక్ష్యమన్నారు. నెల్లూరు జిల్లా పరిశ్రమల హబ్ గా ఏర్పాటు చేసే విధంగా నెలకు ఒక పరిశ్రమను తీసుకొచ్చే విధంగా రానున్న రెండు సంవత్సరాలకు ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరిగిందని తద్వారా జిల్లాలో డిగ్రీ అర్హత పొందిన వారందరికీ జిల్లాలోని ఉపాధి అవకాశం కలుగుతుందన్నారు. రానున్న రెండు సంవత్సరాలలో వీలైనన్ని పరిశ్రమలు జిల్లాకు తేవడమే తన ముందున్న తక్షణ కర్తవ్యం అన్నారు.
అందరి భాగస్వామ్యంతో హాస్టల్స్ పై సర్వే నిర్వహించి అవసరమైన పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఉదయగిరి, దుత్తలూరు ప్రాంతంలో రెండు మెగా పరిశ్రమలు రానున్నాయని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేటు ఉద్యోగాల సైతం ఎక్కువగా ఏర్పడనున్నాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, మన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పండిట్ సుబ్బయ్య మాదిగ, కలివేల ఎలీషా కుమార్, కుడుముల సుబ్బారావు, మన్నేపల్లి దాసు, ఆరుమళ్ళ మురళి, డేగ రాఘవేంద్రరావు, కే.సి. పెంచలయ్య, ఈపూరు వెంకటేశ్వరరావు, తాడిపర్తి పెంచలయ్య, గొల్లపల్లి శ్రీనివాసులు బాల చెన్నయ్య తదితరులు బాబు జగజీవన్ రామ్ ఆశయాలను జీవిత చరిత్రను అర్థమయ్యేలా వివరించారు….