*నెల్లూరులో కాలువ ఆధునీకరణ పనులను పరిశీలించిన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్*

మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలోని 8వ డివిజన్ RSR స్కూల్ నుండి హిమాలయ స్కూల్ వరకు జరుగుతున్న కాలువ ఆధునీకరణ పనులను నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పనులు పూర్తి చేయడమే మంత్రి లక్ష్యమని, గతంలో ఇక్కడ నివసించిన వారందరికీ పనులు పూర్తయిన తర్వాత తిరిగి ఇక్కడే స్థలాలు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని, స్థానికుల సమస్యల పరిష్కారంపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ రావు, జనరల్ సెక్రటరీ అనుదీప్, కార్యదర్శి సుబ్బారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉమామహేశ్వరి, 10 వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ తిరుమల నాయుడు, పొడమేకల సురేష్, బీజేపీ నాయకులు శ్రీనివాసులు, జనసేన నాయకులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *