
*11వ డివిజన్ అధ్యక్షుడు నాగేంద్రను పరామర్శించిన మంత్రి నారాయణ.*
*ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై విచారణ.*
అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 11వ డివిజన్ అధ్యక్షుడు నాగేంద్రను మంత్రి నారాయణ శుక్రవారం పరామర్శించారు. ఇటీవల నాగేంద్ర హార్ట్ స్ట్రోక్‌కు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.
ఈ విషయం తెలుసుకున్న మంత్రి నారాయణ, ఆసుపత్రికి వెళ్లి నాగేంద్ర ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు.
మంత్రి నారాయణతో పాటు నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ,జిల్లా టీడీపీ ఉపాధ్యక్షురాలు విజేతా రెడ్డి ,టిడిపి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి, తదితరులు పాల్గొని నాగేంద్రకు ధైర్యం చెప్పారు.