*శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*
—————————–
నెల్లూరు 4వ డివిజన్ జాకీర్ హుస్సేన్ నగర్ లో *కోదండ రామాలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకలకు స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి*.. వైఎస్ఆర్సిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ *ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* హాజరయ్యారు.

ఈ సందర్బంగా స్థానిక నేతలు.. *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు.*

*ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని.. స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.*

అనంతరం *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి  అన్నదాన కార్యక్రమంలో భాగంగా భక్తులకు.. అన్నదానం చేశారు.*

*ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి*

• జాకీ హుస్సేన్ నగర్ లో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషం

• శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో సంతోషంగా ఉండాలి.

• శ్రీరాముడు మంచి పరిపాలన దక్షుడని.. భారతదేశంలో ఎన్ని యుగాలు గడిచినా.. రామరాజ్యం లాంటి పాలనను ప్రజలందరూ గుర్తు చేసుకుంటూ ఉంటారు.

• ప్రతి ఒక్కరూ శ్రీరాముడు లాంటి.. పరిపాలన దక్షత కలిగిన రాజు తమ రాజ్యానికి కావాలని కోరుకుంటూ ఉంటారు.

• ఈరోజు నెల్లూరు నగర ప్రజలందరూ శ్రీరామనవమి వేడుకలను ఎంతో చక్కగా నిర్వహించుకోవడం..పలు రామాలయాల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని .. రాముని ఆశీస్సులు అందుకోవడం శుభ పరిణామం.

• భక్తులందరూ శ్రీరాముని కృపా కటాక్షాలు .. ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని చంద్రశేఖర్ రెడ్డి గారు ఆకాంక్షించారు.

3, 4, 5 వ డివిజన్ లలోని ysrcp ముఖ్య నాయకులు అందరూ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *